చిన్నారుల పుట్టిన రోజు, పండగ వేడుకలలో అలాగే అనేక శుభకార్యాల్లో పాల్గొన్న పెద్దలకీ, పిల్లలకీ దిష్టిని విభిన్న పద్ధతుల్లో తీస్తూ ఉంటారు.పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు సాధించినప్పుడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడూ దిష్టి తీస్తారు.
చిన్నవాళ్లైనా, పెద్ద వాళ్లైనా అతిగా నీరసించి డీలాపడినప్పుడు దిష్టి తీసి దృష్టి దోషం తొలగిస్తారు. అలాగే పిల్లలకి పసుపు, సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తూంటారు.
బయటి వారి దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టితీస్తారు.
అసలు దిష్టి ఎందుకు తీస్తారు.
దిష్టి తీయడం వల్ల పిల్లలు కలవరింతలు లేకుండా నిద్రపోవటమూ, నిద్రలో ఉలిక్కిపడుతూ లేవటం వంటివి ఉండవు. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల చుట్టూ అంతా చేరటం వల్ల కొంత అస్వస్థతకు గురి అవుతారు.
అందుకే వివాహ వేడుకలలోను, పుట్టిన రోజు వేడుకలలోను విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు.

ఎర్ర రంగు పదే పదే చూడటం వల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకి ప్రశాంతతోపాటు ధైర్య గుణంవస్తుంది. అందుకే ఎక్కువగా ఎర్ర రంగు నీళ్లతోనే దిష్టి తీస్తారు.
లేదంటే చీపురు కట్టతో, ఉల్లిగడ్డ పొట్టు బియ్యంతో, కోడిగుడ్డుతో, జీడి గింజలతో, ఎండు మిరపకాయలతో లేదా నిమ్మకాయతో అలా తీస్తుంటారు. ఇలా దిష్టి తీయడం వల్ల… నర దిష్టి పోయి పిల్లలు ఆడుకుంటారు.
అంతే కాదండోయ్ పెద్దలకు దిష్టి తగిలినా తీసిన వెంటనే బాగవుతారు.ఎప్పటి లాగే తమ పనులు తాము చేస్తుంటారు.