పూర్వం సమాజంలో కీళ్ల నొప్పులు( Knee Pains ) అనేవి 60 సంవత్సరాలు ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి.కానీ ప్రస్తుతం 30 సంవత్సరాలు వచ్చే సరికి కీళ్ల నొప్పులు వస్తున్నాయి.
ముఖ్యంగా చెప్పాలంటే కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.ఒక వేళ తింటే నొప్పులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
అయితే కీళ్ల నొప్పులు ఉన్నవారు పెరుగు( Curd ) తింటే ఇంకా ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.పెరుగు అనేది ప్రతి ఒక్కరు భోజనంలో ఇష్టపడి తింటూ ఉంటారు.
ఒక రకంగా చెప్పాలంటే పెరుగు అన్నం లేకుండా భోజనం పూర్తి కాదు.

అంతే కాకుండా పెరుగులో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్ వంటివి ఎక్కువగా ఉంటాయి.అలాగే పెరుగులో ఉన్న పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.అయితే పెరుగులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కీళ్ల నొప్పులు ఉన్న వారు మాత్రం తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతి రోజు పెరుగు తింటే నొప్పులు పెరిగే అవకాశం ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రిజ్ లో( Refrigirator ) పెట్టిన పెరుగు, పుల్లగా ఉన్న పెరుగు( Sour Curd ) తింటే కీళ్ల నొప్పులు బాగా పెరుగుతాయి.
ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.

అయితే పెరుగు తినాలని అనుకునేవారు పెరుగుకు బదులుగా మజ్జిగ( Butter Milk ) ఉపయోగించవచ్చు.అయితే మజ్జిగలో బెల్లం( Jaggery ) కలుపుకొని తీసుకుంటే ఎముకలు కండరాలు దృఢంగా మారి కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.అంతే కాకుండా నీరసం, అలసట, వంటివి కూడా తొలగిపోతాయి.
ఇంకా చెప్పాలంటే అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా పేరుగుకు బదులుగా మజ్జిగ తీసుకుంటే వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.అలాగే అధిక బరువు కూడా దూరం చేసుకోవచ్చు.
కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు పెరుగు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.