న్యూస్ రౌండప్ టాప్ 20

1.వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు

Telugu Ap Cm Jagan, Balakrishna, Godavari, Gold, Harish Rao, Jagan, Mla Hasarath

పెనుమలూరు వైసిపి ఎమ్మెల్యే పార్థసారథి గుండుపోటుకు ( Parthasarathy )గురైనట్లు సమాచారం.దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అశోక్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు.ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు నిర్వహించి యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Gold Rate ,-TeluguStop.com

2.నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ

ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది.బెల్లంకొండ సురేష్ కారు అద్దం పగలగొట్టి కారు నుంచి నగదు ఖరీదైన మద్యం బాటిళ్లను దొంగలు ఎత్తుకెళ్లారు.

3.బాలకృష్ణకు యువరాజ్ సింగ్ శుభాకాంక్షలు

Telugu Ap Cm Jagan, Balakrishna, Godavari, Gold, Harish Rao, Jagan, Mla Hasarath

హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( Balakrishna )కు క్రికెటర్ యువరాజ్ సింగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

4.మార్చినాటికి పోలవరం పూర్తి

Telugu Ap Cm Jagan, Balakrishna, Godavari, Gold, Harish Rao, Jagan, Mla Hasarath

పోలవరం ప్రాజెక్టు( Polavaram Project ) వచ్చే మార్చినాటికి పూర్తిచేసి జగన్ చేతుల మీదుగా తాగునీరు అందిస్తామని ఏపీ మంత్రి కారుమూరు నాగేశ్వరావు అన్నారు.

5.వైసిపి ఎమ్మెల్యేకు పారాభిషేకం

తమ ఊరికి రోడ్డు వేయించడంతో ఎమ్మెల్యేకు సన్మానం చేసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండలం పి జాతరపల్లిలో చోటుచేసుకుంది.వైసిపి ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఎన్నికల హామీ మేరకు గ్రామానికి రోడ్డు వేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చడంతో గ్రామస్తులు ఎమ్మెల్యేను ఈ విధంగా సన్మానించారు.

6.తిరుమల సమాచారం

Telugu Ap Cm Jagan, Balakrishna, Godavari, Gold, Harish Rao, Jagan, Mla Hasarath

తిరుమలలో భక్తుల రద్దీ ( Tirumala )కొనసాగుతోంది.నేడు క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి.స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

7.నేడు శ్రీకాళహస్తిలో బిజెపి భారీ బహిరంగ సభ

మోదీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన దేశాభివృద్ధిని వివరించేందుకు బిజెపి ఈరోజు సాయంత్రం శ్రీకాళహస్తిలోని బేరి వారి మండపం వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.దీనికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ హాజరు కాబోతున్నారరు.

8.సోము వీర్రాజు కామెంట్స్

Telugu Ap Cm Jagan, Balakrishna, Godavari, Gold, Harish Rao, Jagan, Mla Hasarath

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం కాదని,  దాంట్లో ఏమైనా కొరవలు ఉంటే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు( Somu Veerraju ) అన్నారు.

9.రాయలసీమ డిక్లరేషన్ పేరుతో మళ్లీ మోసం

రాయలసీమ డిక్లరేషన్ పేరుతో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నా రని టిడిపిని ఉద్దేశించి వైసిపి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు చేశారు.

10.ఈ ఏడాది 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు

 అందించేందుకు కేంద్రం రుణ ప్రణాళికను ఖరారు చేసిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

11.కెసిఆర్ పై హరీష్ రావు ప్రశంసలు

Telugu Ap Cm Jagan, Balakrishna, Godavari, Gold, Harish Rao, Jagan, Mla Hasarath

పుట్టుక నుంచి చావు దాకా ప్రజలకు ఏం కావాలో ఆలోచించింది సీఎం కేసీఆర్ అని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

12.త్వరలోనే గౌరవిల్లి ప్రాజెక్టు ప్రారంభం

త్వరలోనే గౌరవల్లి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

13.గోదావరి నదికి కేసీఆర్ ప్రత్యేక హారతి

Telugu Ap Cm Jagan, Balakrishna, Godavari, Gold, Harish Rao, Jagan, Mla Hasarath

తెలంగాణ సీఎం కేసీఆర్ గోదావరి నదికి ప్రత్యేక హారతి సమర్పించారు.

14.తెలంగాణలో దివ్యాంగులకు పింఛన్ పెంపు

తెలంగాణలో దివ్యాంగులకు వచ్చే నెల నుంచి 4116 పింఛన్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

15.రేపు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష

Telugu Ap Cm Jagan, Balakrishna, Godavari, Gold, Harish Rao, Jagan, Mla Hasarath

గ్రూప్ వన్ రెలిమినరీ పరీక్షకు టీఎస్పీఎస్సీ ( TSPSC Group 1 Prelims Exam )ఏర్పాట్లు చేసింది.రేపు పరీక్ష ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించనున్నారు.

16.చంద్రబాబు పై ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు

టిడిపి అధినేత చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శించారు.

17.జగన్ ను కలిసిన ఏపీ ఎన్జీవోలు

ఏపీ సీఎం జగన్ ఏపీ ఎన్జీవో బండి శ్రీనివాస్ శివారెడ్డి తదితర ఉద్యోగ సంఘ నాయకులు కలిశారు.12వ పి.ఆర్.సి ప్రకటించినందుకు జగన్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

18.నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.మృగశిర కార్తి సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో శనివారం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

19.చెరువులో పడ్డ తెలంగాణ మంత్రి

తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బోటు ప్రమాదంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడ్డారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Cm Jagan, Balakrishna, Godavari, Gold, Harish Rao, Jagan, Mla Hasarath

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,500

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 60,550

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube