సినిమా ఇండస్ట్రీలో మతాంతర వివాహాలు ఆపై వాటి వల్ల వచ్చే సమస్యల గురించి ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.అందరూ కొన్ని సినిమాలు మంచి సక్సెస్ అవగా మరికొన్ని సినిమాలు మిక్స్డ్ టాక్ ని తెచ్చుకున్నాయి.
సినిమాలలో జరిగిన కొన్ని సన్నివేశాలు కొన్నిసార్లు నిజజీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి.ముఖ్యంగా ప్రముఖులు మతాంతర వివాహాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు.
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఇలా మతాంతర వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే.వారిలో కోలీవుడ్ కి చెందిన నటి రెజీనా కసాండ్రా( Regina Cassandra ) కూడా ఒకరు.
తెలుగులో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం,సౌఖ్యం వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రెజీనా.
ఈ సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించడంతోపాటు రెజినాజు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.అయితే రెజీనా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం కన్నడ హిందీ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.పలు చిత్రాల్లో ఐటమ్స్ సాంగ్స్ లో నటించిన ఆమె ఆచార్య సినిమాలో( Acharya Movie ) మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులు వేసింది.
ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్ ల్లోనూ ఆమె నటించారు.తాజాగా నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన విడాముయర్చి చిత్రంలో ముఖ్యపాత్రను పోషించారు.కాగా తన మతం గురించి ప్రస్తావన వస్తే ఆమె ఇలా పేర్కొన్నారు.
పుట్టినప్పుడు ఇస్లాం మతస్తురాలుగా ఉన్న ఈమె ఆ తరువాత క్రిస్టియన్ మతానికి మారినట్లు చెప్పారు.దీని గురించి నటి రెజీనా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తన తల్లి క్రిస్టియన్ మతానికి చెందిన వారిని తండ్రి ఇస్లాం మతస్తుడని పేర్కొన్నారు.ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తాను పుట్టినప్పుడు ఇస్లాం మతస్తురాలిగా పెరిగానన్నారు.
అయితే నేను ఆరేళ్ల వయసులో ఉండగా అమ్మానాన్న విడిపోయారు. అప్పుడు తన అమ్మగారు తిరిగి క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యి రెజీనా పేరుకు కసాండ్రా జత చేశారట.
దీంతో తాను బాప్తిజం పొంది బైబిల్ చదివినట్లు చెప్పారు.అలా ఆమె రెజీనా కసాండ్రాగా అందరికీ పరిచయం అయింది.
వాస్తవానికి తన అసలు పేరు రెజీనా మాత్రమేనని తెలిపింది.మతం విషయంలో తనకు ఎలాంటి పట్టింపులు లేవని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆమె చేసిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.