నా మనవరాలే ఫస్ట్ ప్రపోజ్ చేసింది.. మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులలో మురళీ మోహన్( Murali Mohan ) ఒకరు కాగా మురళీ మోహన్ మనవరాలు రాగ,( Raaga ) శ్రీ సింహా( Sri Simha ) కొన్నిరోజుల క్రితం పెళ్లి పీటలెక్కారు.ఈ పెళ్లి వేడుక గురించి మురళీ మోహన్ మాట్లాడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.

 Murali Mohan Comments About His Grand Daughter Love Details, Murali Mohan, Mural-TeluguStop.com

మురళీ మోహన్ మాట్లాడుతూ రాజమౌళి కోడలు పూజ, నా మనవరాలు రాగ క్లోజ్ ఫ్రెండ్స్ అని అన్నారు.

ఇద్దరూ ఒకరింటికి ఒకరు వెళ్లేవారని ఆ సమయంలో రాజమౌళి,( Rajamouli ) కీరవాణి( Keeravani ) కుటుంబాలు ఎంత క్లోజ్ గా ఉంటాయో చూసి తనే ఒకరోజు శ్రీసింహకు ప్రపోజ్ చేసిందని మురళీ మోహన్ అన్నారు.

ఈ విషయం మొదట మాకు చెప్పలేదని పెళ్లి ప్రస్తావన వచ్చిన సమయంలో రాగ తన మనస్సులోని మాటను బయటపెట్టిందని మురళీ మోహన్ పేర్కొన్నారు.రాగ సెలక్షన్ బాగుండటంతో మేము కూడా వెంటనే ఓకే చెప్పామని ఆయన తెలిపారు.

Telugu Murali Mohan, Raaga Maganti, Raagasri, Sri Simha, Sri Simha Raaga-Movie

పెళ్లి కూతురిని సాధారణంగా వధువు తరపు వాళ్లు పల్లకి మోస్తూ మండపానికి తీసుకెళ్లాలని కానీ కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవ మరి కొందరు పల్లకి మోస్తూ రాగను తీసుకెళ్లారని మురళీ మోహన్ అన్నారు.ఆ సమయంలో ఎంతో సంతోషమేసిందని ఆయన చెప్పుకొచ్చారు.శ్రీ సింహ యమదొంగలో బాల నటుడిగా నటించగా మత్తు వదలరా సినిమాతో( Mathu Vadalara Movie ) మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Telugu Murali Mohan, Raaga Maganti, Raagasri, Sri Simha, Sri Simha Raaga-Movie

మురళీ మోహన్ కు కుమారుడు, కూతురు ఉన్నారు.మురళీ మోహన్ కొడుకు రామ్మోహన్ రూపల కూతురే రాగ.శ్రీ సింహా , రాగ జోడీ చూడముచ్చటగా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మురళీ మోహన్ వెల్లడించిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.కొన్నేళ్ల క్రితం వరకు నిర్మాతగా కూడా బిజీగా ఉన్న మురళీ మోహన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు.

మురళీ మోహన్ వ్యాపారవేత్తగా సైతం విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube