వైరల్ వీడియో: భూమి నుండి10 అడుగుల ఎత్తులోకి ఎగిసిపడుతున్న నీరు

జైసల్మేర్‌లోని( Jaisalmer ) మోహన్‌గఢ్ కాలువ( Mohangarh Canal ) ప్రాంతంలో జరిగిన అరుదైన భౌగోళిక సంఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.ఒక రైతు పొలంలో బోరుబావి( Borewell ) తవ్వుతుండగా ఒక్కసారిగా భూమి కుంగిపోయింది.

 Jaisalmer Tubewell Digging Viral Video Truck Sinks Into Deep Pit Details, Jaisal-TeluguStop.com

ఈ సంఘటనలో భూమి నుంచి నీరు, గ్యాస్ తీవ్ర ఒత్తిడితో బయటకు రావడం ప్రారంభమైంది.బోరింగ్ పనులకు ఉపయోగించిన యంత్రాలు, ట్రక్కు భూమిలో కూరుకుపోయాయి.

ఆ తర్వాత భూమిలో నుండి నీటి ప్రవాహం 10 అడుగుల ఎత్తులోకి ఎగిసిపడింది.ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు.

ఈ ఘటన జైసల్మేర్‌లోని మోహన్‌గఢ్ కాలువ ప్రాంతంలోని విక్రమ్‌సింగ్ అనే రైతు పొలంలో చోటుచేసుకుంది.బోరుబావి కోసం 850 అడుగుల మేర తవ్వుతుండగా అకస్మాత్తుగా భూమి కుంగింది.దీనివల్ల భూగర్భం నుంచి నీరు,( Water ) గ్యాస్( Gas ) తీవ్రమైన ఒత్తిడితో బయటకు వచ్చాయి.నీటి పీడనంతో పాటు, తెల్లరంగు ఇసుక కూడా బైటపడింది.

దాదాపు 12 గంటల పాటు నీటి ప్రవాహం నిరంతరంగా కొనసాగింది.

ఈ సమాచారం అందుకున్న వెంటనే భూగర్భ జల శాస్త్రవేత్తలు, జిల్లా యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.భూగర్భ జల నిపుణులు ఈ ప్రాంతంలో భారీ నీటి రిజర్వాయర్ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.పరిపాలనా చర్యలతో పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు.

భూగర్భ నీటి ఉప్పెన ఇంకా కొనసాగుతుండటంతో, ఈ ప్రాంతానికి 500 మీటర్ల పరిధిలో ప్రవేశాన్ని నిషేధించారు.తాత్కాలిక పోలీసు పోస్టు ఏర్పాటు చేసి, గ్యాస్ లీకేజీ వల్ల ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఆయిల్ గ్యాస్ సంస్థ ఓఎన్‌జీసీ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.

భూగర్భ శాస్త్ర నిపుణులు డాక్టర్ నారాయణ్ దాస్ ఇంఖియా ఈ ఘటనపై మాట్లాడుతూ, ఇసుక రాతి నిర్మాణం కారణంగా నీటి ఉప్పెన సంభవించిందని తెలిపారు.

ఈ ప్రాంతంలో వచ్చే నీరు ఉప్పు నీరుగా ఉండటాన్ని గమనించామని, గ్యాస్ లీకేజీ వల్ల నీటి ప్రవాహం మరింత ఉద్ధృతం అవుతుందని చెప్పారు.భూమి నుండి నీరు, గ్యాస్ ఉప్పెనతో భయానక దృశ్యాలు కనిపించాయి.

దీనివల్ల చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.నిపుణులు ఆ ప్రాంతానికి చేరుకొని, గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube