లోక్‌సభ ఎన్నికలను పట్టించుకోని ఎన్ఆర్ఐ ఓటర్లు .. షాకిస్తోన్న ఈసీ నివేదిక

విదేశాల్లో స్థిరపడిన భారతీయులు( Indians ) మన దేశంలో జరిగే ఎన్నికల్లో పాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే.ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎన్నికల రోజు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

 Poor Participation Of Overseas Indian Voters In Lok Sabha Election 2024 Ec , Ind-TeluguStop.com

పోలింగ్ స్టేషన్ ఇంటి పక్కనే ఉన్నా ఓటు వేయని ఎంతో మందికి ఇలాంటి వారు ఆదర్శంగా నిలుస్తున్నారు.అయితే ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక విషయాలను బయటపెట్టింది.ఓటరు జాబితాలో నమోదు చేసుకున్న 1.2 లక్షల మంది విదేశీ భారతీయులు.ఓటర్లుగా నమోదు చేసుకోవడంలో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదు.

ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం 2024లో 1,19,374 మంది ఓవర్సీస్ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.కేరళలో అత్యధికంగా 89,839 మంది నమోదు చేసుకోగా.2019లో ఈ సంఖ్య 99,844గా ఉంది.అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనేందుకు ఈసారి కేవలం 2,958 మంది విదేశీ ఓటర్లు మాత్రమే భారతదేశానికి వచ్చినట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది.

వీరిలో అత్యధికంగా 2,670 మంది ఒక్క కేరళ నుంచే ఉన్నారట.ఇదే సమయంలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు( Karnataka, Uttar Pradesh, Tamil Nadu ) వంటి పెద్ద రాష్ట్రాల నుంచి ఏ ఒక్క విదేశీ ఓటరు కూడా ఎన్నికల్లో పాల్గొనలేదట.

Telugu Assembly, Indian, Indians, Karnataka, Lok Sabha Ec, Poorindian, Primemodi

ప్రధాని మోడీ( Prime Minister Modi ) సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 885 మంది విదేశీ ఓటర్లు నమోదు చేసుకోగా.లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఇద్దరు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మహారాష్ట్రలో 5,097 మంది ఎన్ఆర్ఐ ఓటర్లకు గాను 17 మంది మాత్రమే ఓటు వేశారు.ఆంధ్రప్రదేశ్‌లో 7927 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు నమోదై ఉండగా.కేవలం 195 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Telugu Assembly, Indian, Indians, Karnataka, Lok Sabha Ec, Poorindian, Primemodi

2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 19,500 మందికి పైగా నమోదైన విదేశీ ఓటర్లు పెరిగినప్పటికీ.తాజా ఎన్నికల్లో వారి భాగస్వామ్యం తక్కువగా ఉందని ఈసీ తెలిపింది.వివిధ కారణాల వల్ల విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు .లోక్‌సభ, అసెంబ్లీ, ఇతర ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులైన వారిని విదేశీ ఓటర్లుగా ఈసీ అభివర్ణించింది.ప్రయాణ ఖర్చులు, విదేశాల్లో ఉద్యోగాలు, విద్య, ఇతరత్రా కారణాలను విదేశీ ఓటర్లు ప్రస్తావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube