టాలీవుడ్ దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) మహేష్ బాబు( Mahesh Babu ) కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని మహేష్ అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.కానీ ఇప్పట్లో ఈ సినిమా విడుదల కాదు అన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా 2027లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు మొదటి నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ పది అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.కానీ తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేమిటంటే ఈ సినిమా 2027 మార్చి 25న విడుదల కానుందని ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.
ఈ తేదీని చూసి కూడా ఫ్యాన్స్ కూడా తెగ ఆనందిస్తున్నారు.ఎందుకంటే 2022 మార్చి 25 న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా( RRR ) విడుదల అయినా విషయం తెలిసిందే.
ఆ సినిమా ఘనవిజయం సాధించడమే కాదు, ఏకంగా తెలుగు చిత్రసీమకు తొలి ఆస్కార్ అవార్డును( Oscar Award ) కూడా సంపాదించి పెట్టింది.అందువల్ల రెండేళ్ళ తరువాత మార్చి 25న రాజమౌళి, మహేశ్ సినిమా రిలీజయితే అది కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసేస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు.

కొందరిలో అనుమానాలూ చోటు చేసుకుంటూ ఉంటాయి.ఇప్పుడు 2027 మార్చి 25న రాజమౌళి, మహేశ్ సినిమా రాబోతోందని తెలియగానే కొందరిలో ఆనందం, మరికొందరిలో అనుమానం చోటు చేసుకుంటున్నాయి.ఆల్రెడీ రాజమౌళి మార్చి 25వ తేదీన విడుదల చేసిన తన ఆర్ఆర్ఆర్ తో సెన్సేషన్ ను క్రియేట్ చేశారు.ఇక మహేశ్ కెరీర్ లో మార్చి నెలలో సినిమాలు వచ్చినట్టు కనిపించడం లేదు.
కాబట్టి కొత్త డేట్ తో మహేశ్ కలెక్షన్ల వర్షం కురిపిస్తారని ఆయన ఫ్యాన్స్ విశ్వాసం.అయితే రాజమౌళి మహేష్ బాబు సినిమా విషయంలో ఆర్ఆర్ఆర్ సెంటిమీటర్లు ఫాలో అవుతారా లేదంటే మరో తేదీకి విడుదల చేస్తారా అన్నది చూడాలి మరి.