మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్లకు కొన్ని నిక్ నేమ్స్ ఉండడం అన్నది కామన్.ఇందులో కొన్ని నేమ్స్ వారి నటించిన సినిమాల ద్వారా కూడా వస్తుంటాయి.
కొంతమంది అసలు పేర్ల కంటే సినిమాలు నటించిన పాత్రల పేర్లు ఎక్కువగా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు.అంతలా సినిమాలోని పాత్రలు హీరోయిన్లకు హీరోలకు గుర్తింపు తెచ్చి పెడుతూ ఉంటాయి.
ఇకపోతే సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది స్టార్ హీరోయిన్స్ కు నిక్ నేమ్స్ కూడా ఉన్నాయట.ఆ హీరోయిన్స్ ఎవరు ఆ నిక్ నేమ్స్ ఏంటి? అన్న విషయానికొస్తే.

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిష( Trisha ) సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా దశాబ్దాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికీ వన్నె తగ్గని అందంతో, తన నటనతో అందరి మనసులు దోచేస్తు ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ దూసుకుపోతోంది.ఇకపోతే హీరోయిన్ త్రిషకు చాలానే ముద్దు పేర్లు ఉన్నాయట.అందులో కొందరు ట్రాష్ అని పిలిస్తే మరికొందరు హనీ ట్రిష్ అని పిలుస్తుంటారట.అదేవిధంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్( Aishwarya Rai ) ముద్దు పేరు ఐష్ అని పిలుస్తూ ఉంటారట.కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఈమెను గుల్లు అని పిలుస్తూ ఉంటారట.

అలాగే టాలీవుడ్ హీరోయిన్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) మొదట అందాల రాక్షసి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీచి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇటీవలే మెగా కోడలిగా కూడా మెగా ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చింది.చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.అయితే ఈ ముద్దుగుమ్మ నిక్ నేమ్ వింటే షాక్ అవుతారు.ఈ అమ్మడును తన తల్లిదండ్రులు చున్ చున్ అని పిలిచేవారట.ఎందుకంటే లావణ్య చిన్నప్పుడు పాడిన పద్యంలోని పదాన్ని ఈ బ్యూటి నిక్ నేమ్ గా పిలిచారట.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్( Alia Bhatt ) కి కూడా ఒక నిక్ నేమ్ ఉందట.అలియాని చిన్నప్పటినుంచి తన తల్లిదండ్రులు పొటాటో అని ప్రేమగా పిలిచేవారట.
అలాగే సోనమ్ కపూర్( Sonam Kapoor ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈమెను అందరూ ప్రేమగా జిరాఫీ అని పిలిచేవారట.
ఈ విషయాన్ని సోనమ్ ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ వెళ్లడించింది.