అంగారకుడి గ్రహం( Mars ) లేదా మార్స్ గురించి ఓ సంచలన నిజం బయటపెట్టారు సైంటిస్టులు.ఒకప్పుడు మార్స్‌పై మనలాంటి మనుషులు జీవించేవారట.
అంతేకాదు, వాళ్లు మనకంటే చాలా తెలివైనోళ్లట.కానీ, వాళ్లందరూ ఒక్కసారిగా చచ్చిపోయారు.
ఎందుకంటే అక్కడ అణుబాంబు( Atom Bomb ) దాడి జరిగిందట.
ఈ షాకింగ్ థియరీని డాక్టర్ జాన్ బ్రాండెన్‌బర్గ్( Dr.John Brandenburg ) అనే ఒక పెద్ద ఫిజిసిస్ట్ కనిపెట్టారు.ఆయన 2011లోనే ఈ విషయం చెప్పారు.
అప్పటినుంచి అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు.తాజాగా మళ్లీ ఆయన చెప్పిన థియరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అసలు ఆయన ఏం చెప్పారంటే, మార్స్ ఎర్రగా ఉండటానికి కారణం కేవలం ఐరన్ వల్ల మాత్రమే కాదంట.అక్కడ ఏదో అణు విపత్తు జరిగిందట.
అందుకే అలా ఎర్రగా మారిపోయిందంటున్నారు బ్రాండెన్‌బర్గ్.
మార్స్‌పై కొన్ని వింత కెమికల్స్ ఉన్నాయని ఆయన చెబుతున్నారు.జేనాన్-129, యురేనియం, థోరియం లాంటివి అక్కడ ఎక్కువగా ఉన్నాయంట.ఇవి అణుబాంబులు పేల్చిన చోట ఎక్కువగా కనిపిస్తాయి.
భూమి మీద కూడా అణు పరీక్షలు చేసిన ప్రదేశాల్లో ఇవే కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయని ఆయన వాదిస్తున్నారు.అంటే మార్స్‌పై కూడా అణు యుద్ధం జరిగి ఉంటుందని ఆయన నమ్మకం.
కానీ మిగతా సైంటిస్టులు మాత్రం బ్రాండెన్‌బర్గ్‌తో ఏకీభవించడం లేదు.అణు యుద్ధం జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటున్నారు.అక్కడ బాంబులు పడిన గుర్తులు గానీ, రేడియేషన్ గుర్తులు గానీ, లేదా ఏమన్నా పాడుబడిన సిటీలు గానీ ఏమీ లేవు కదా అని ప్రశ్నిస్తున్నారు.ఇంకో విషయం ఏంటంటే బ్రాండెన్‌బర్గ్ రాసిన ఆర్టికల్ అంతగా ఎవరికీ తెలియని ఒక చిన్న సైన్స్ జర్నల్‌లో పబ్లిష్ అయిందట.
అందుకే చాలామంది సైంటిస్టులు దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు.
అయితే ఈ మధ్య “డానీ జోన్స్ పాడ్‌కాస్ట్” అనే ఒక ప్రోగ్రామ్‌లో మళ్లీ ఈ టాపిక్ తెరపైకి వచ్చింది.
జేసన్ రేజా జోర్జానీ అనే ఒక రచయిత, ఫిలాసఫర్.ఆయన బ్రాండెన్‌బర్గ్ చెప్పిన విషయాలను “భయంకరమైన సాక్ష్యాలు” అంటూ సపోర్ట్ చేశారు.జేనాన్-129 అనే కెమికల్ సౌర కుటుంబం మొత్తం మీద ఎక్కడ చూసినా తక్కువగానే ఉంటుందంట.కానీ మార్స్‌పై మాత్రం అది చాలా ఎక్కువగా ఉందని ఆయన అంటున్నారు.
ఈ కెమికల్ అణుబాంబులు పేలితేనే ఎక్కువగా వస్తుందని అతడు నమ్మకంగా చెబుతున్నారు.
నాసా వాళ్లు కూడా మార్స్‌పై జేనాన్-129, జేనాన్-126 అనే కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయని కనుక్కున్నారట.అది కూడా సిడోనియా అనే ప్రాంతంలో.ఈ సిడోనియాలో మనిషి ముఖంలాంటి ఆకారాలు, పిరమిడ్ల్లాంటి కొండలు ఉన్నాయని చాలామంది నమ్ముతారు.
అయితే నాసా వాళ్లు మాత్రం ఇవన్నీ సహజంగా ఏర్పడిన రాళ్లు అని, ఆ కెమికల్స్ అగ్నిపర్వతాల వల్ల వచ్చి ఉంటాయని తేలిగ్గా కొట్టేస్తున్నారు.
కానీ బ్రాండెన్‌బర్గ్ మాత్రం నాసా చెప్పే మాటలను అస్సలు నమ్మడం లేదు.
ఆ కెమికల్ గుర్తులు అణుబాంబు పేలితే ఎలా ఉంటాయో అచ్చం అలానే ఉన్నాయని ఆయన అంటున్నారు.ఒకప్పుడు మార్స్ భూమిలాగే పచ్చగా ఉండేదని, అక్కడ చెట్లు, జంతువులు, మనుషులు కూడా ఉండేవారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.అంతేకాదు వాళ్లు ఈజిప్టు వాళ్లలాగా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండేవారని కూడా అంటున్నారు.
1984లో CIA వాళ్లు “రిమోట్ వ్యూయింగ్” అనే ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారంట.అంటే దూరం నుంచి చూడకుండానే ఒక ప్రదేశాన్ని మనసుతో చూడటం అన్నమాట.జో మెక్‌మోనేగిల్ అనే ఒక సైకిక్ స్పై (భవిష్యత్తు చెప్పే గూఢచారి) మార్స్‌ని రిమోట్ వ్యూయింగ్ చేసి కొన్ని విషయాలు చెప్పాడంట.
మార్స్‌పై పాడుబడిన సిటీలు, పిరమిడ్ల్లాంటి కట్టడాలు, పెద్ద మనుషులు చనిపోతున్నట్లుగా కనిపించాయట ఆయనకి.ఒక మనిషి ఎముక, మార్స్ నేల ఫొటోలు కూడా కనిపించాయని ఆయన చెప్పడం ఇంకా షాకింగ్‌గా ఉంది.
మొత్తానికి ఈ అణుయుద్ధం థియరీ మాత్రం ఇంకా ఎవ్వరూ నమ్మేలా లేదు.