టాలీవుడ్ స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు( Pradeep Machiraju ) నటించిన లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.( Akkada Ammayi Ikkada Abbayi ) ఈ సినిమాలో దీపికా పిల్లి( Deepika Pilli ) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
నితిన్ భరత్ లు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.మాంక్స్ మంకీస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది.
అయితే ఇప్పటికే విడుదల అయిన టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇది ఇలా ఉంటే ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ఎలా ఉంది కథ ఏమిటి? ఈ సినిమాతో ప్రదీప్ సక్సెస్ ను అందుకున్నారా లేదా అన్న వివరాల్లోకి వెళితే.
కథ:
కృష్ణ (ప్రదీప్) హైదరాబాద్ లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు.ఆంధ్ర తమిళనాడు బోర్డర్ లో ఒక గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ ఆ కంపెనీకి దక్కడంతో, తన డ్రైవర్(సత్య)తో కలిసి ప్రదీప్ ఆ ఊరికి వెళ్తాడు.అయితే, ఆ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి.
వాటిని బట్టి ఆ ఊరిలోకి కొత్త వాళ్ళను రానివ్వరు.కానీ ప్రభుత్వ పని కావడంతో కొన్ని నిబంధనల మేరకు వారిని లోపలికి రాణిస్తారు.
నిజానికి ఆ ఊరిలో 60 మంది కుర్రాళ్లకు గానూ ఏకైక అమ్మాయి రాజా(దీపిక) ఉంటుంది.ఆమెను ఆ గ్రామానికి అదృష్ట దేవతగా భావించి, ఆమె ఆ 60 మంది కుర్రాళ్లలో ఎవరో ఒకరిని వివాహం చేసుకోవాలని, ఆ వివాహం చేసుకున్న వారిని ప్రెసిడెంట్‌గా చేయాలని ఊరి వారంతా ముందే ఫిక్స్ అవుతారు.
అయితే, అనుకోకుండా రాజాను కృష్ణ కలవడమే కాకుండా, మొదటి కలయికలోనే ముద్దు పెడతాడు.అసలు ఆమెను చూడాలంటేనే ఊరిని దాటుకు వచ్చే పరిస్థితిని దాటి నెమ్మదిగా వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది.
ఆ తర్వాత ఏమయింది? కృష్ణ రాజాను పెళ్లి చేసుకున్నాడా? ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనే వివరాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ప్రదీప్, దీపిక పిల్లి హీరో, హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీపై సినిమా విడుదలకు ముందే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.కాగా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఫన్ మోడ్ లోనే సాగుతూ ఉంటుంది.తమిళనాడు సరిహద్దు లోని ఒక ఆంధ్ర గ్రామంలో పుట్టిన ఏకైక అమ్మాయి రాజాను ఆ ఊరి యువకులందరూ అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు.
అయితే 60 మందిలో ఒకరిని ఆమె వివాహం చేసుకుంటే ఆ ఒక్కరికి ఊరికి ప్రెసిడెంట్ పదవిని వారసత్వంగా కట్టబెట్టి, ఊరిని జాగ్రత్తగా చూసుకునేలా ఆ ఊరి పెద్ద ప్లాన్ చేస్తాడు.అలాగే ఆసక్తికరమైన ఇంటర్వెల్ తో ఫస్ట్ హాఫ్ ముగించారు.
ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఆకట్టుకుంటుంది.చాలా చోట్ల సత్య, ప్రదీప్ ట్రాక్ తో పాటు సత్య,( Sathya ) గెటప్ శ్రీను( Getup Srinu ) ట్రాక్ లు కూడా బాగా పేలాయి.
ఫస్ట్ హాఫ్ ఎంత ఆసక్తికరంగా సాగిందో, సెకండ్ హాఫ్ మాత్రం కూడా అంతే ఆసక్తికరంగా మలచడంలో కాస్త ఫెయిల్ అయ్యారని చెప్పాలి.ఫస్ట్ హాఫ్ కామెడీ చాలా ఆర్గానిక్‌గా వస్తే, సెకండ్ హాఫ్‌లో కామెడీ మాత్రం కాస్త ఫోర్స్డ్‌గా అనిపిస్తుంది.

నటీనటుల పనితీరు:
ప్రదీప్.కృష్ణ అనే పాత్రలో బాగా నటించి ఆకట్టుకున్నాడు.పక్కవాడు ఎలా పోతే నాకేం అనుకునే ఒక టిపికల్ మైండ్‌సెట్ ఉన్న కుర్రాడి పాత్రలో ఇమిడిపోయాడు.అలాగే రాజా అనే పాత్రలో దీపిక కూడా అలాగే సెట్ అయింది.
వీరిద్దరి కాంబినేషన్ కూడా స్క్రీన్ మీద బాగానే వర్క్ అవుట్ అయ్యింది.అలాగే సత్యతో పాటు గెటప్ శ్రీను చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
వీరిద్దరి ట్రాక్ ఆసక్తికరంగా సాగడం సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పాలి.మురళీధర్ గౌడ్, రోహిణి వంటి వారు ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.
సాంకేతికత:
రథన్ అందించిన పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి.బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది.
లొకేషన్స్ కూడా సినిమాకి తగ్గట్టుగా బాగున్నాయి.నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టు బాగున్నాయి.
నిడివి విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.సినిమాటోగ్రఫీ సినిమాకు కాస్త మైనస్ అయిందని చెప్పాలి.సినిమాలోని పాటలు కూడా బాగానే ఉన్నాయి.