కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( Kerala PSC ) పరీక్షకు హాజరయ్యేందుకు సిద్ధమైన ఓ అభ్యర్థికి ఊహించని షాక్ తగిలింది.పరీక్ష హాల్‌లోకి వెళ్లే నిమిషాల ముందు ఒక గద్ద ( Eagle ) ఆయన హాల్ టికెట్‌ను ఎత్తుకుపోయింది.
ఈ వింత, మర్చిపోలేని ఘటన కాసరగోడ్‌లోని గవర్నమెంట్ యూపీ స్కూల్‌లో ఏప్రిల్ 10వ తేదీ ఉదయం చోటుచేసుకుంది.పరీక్షా కేంద్రంలో 300 మందికి పైగా అభ్యర్థులు, అధికారులు ఉండగా, అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
వివరాల్లోకి వెళితే, పరీక్షకు ముందు కాస్త రిలాక్స్ అవుదామని, చదువుకున్నది మరోసారి రివైజ్ చేసుకుందామని అనుకున్నాడు ఆ అభ్యర్థి.అందుకే పరీక్షా కేంద్రానికి కాస్త ముందుగానే చేరుకున్నాడు.
పక్కనే ఉన్న పారిష్ హాల్ దగ్గర కూర్చుని తన హాల్ టికెట్‌ను( Hall Ticket ) పక్కన పెట్టుకుని నోట్స్ తిరగేస్తున్నాడు.అంతలోనే ఆకాశం నుంచి ఒక గద్ద ఒక్కసారిగా మెరుపులా దూసుకొచ్చింది.
రెప్పపాటులో హాల్ టికెట్‌ను తన ముక్కుతో పట్టుకుని ఎత్తుకు ఎగిరిపోయింది.నేరుగా అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్లి, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చాలా ఎత్తులో ఉన్న కిటికీ అంచున వాలింది.
అక్కడే హాల్ టికెట్‌ను పట్టుకుని కూర్చుంది.ఎవరూ అందనంత ఎత్తులో గద్ద అలా కూర్చోవడంతో ఏం చేయాలో ఎవరికీ పాలుపోలేదు.

ఇదంతా కళ్లారా చూసిన అభ్యర్థులంతా షాక్‌తో నోరెళ్లబెట్టారు.కొందరు వెంటనే సాయం చేయడానికి ముందుకు వచ్చారు.గద్దను బెదిరించడానికి కర్రలు, రాళ్లు విసరాలని కొందరు సలహా ఇచ్చారు.కానీ, అలా చేస్తే గద్ద హాల్ టికెట్‌ను ఎక్కడైనా పడేస్తుందేమో లేదా పూర్తిగా ఎగురుకుపోతుందేమో అని ఆ అభ్యర్థి భయపడ్డాడు.
దీంతో అందరూ ఏం చేయాలో తెలియక టెన్షన్‌తో ఊపిరి బిగబట్టుకుని చూస్తూ ఉండిపోయారు.

సమయం మాత్రం ఎవరి కోసం ఆగదు కదా.పరీక్ష ప్రారంభ సమయం దగ్గర పడుతోంది.హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతించరు.
ఇక తన ప్రయత్నాలు ఫలించవని, ఈసారి పరీక్ష రాయలేనేమో అని ఆ అభ్యర్థి దాదాపుగా నిరాశ చెందాడు.అందరూ ఆశలు వదులుకున్నారు.
కానీ, అంటారు కదా.దేవుడు కరుణిస్తే ఏదైనా సాధ్యమేనని, సరిగ్గా అలాంటి అద్భుతం జరిగింది.ఒక్కసారిగా గద్ద తనంతట తానే హాల్ టికెట్‌ను కిందకు వదిలేసింది.అంతే, ఆ అభ్యర్థి పరుగు పరుగున వెళ్లి హాల్ టికెట్‌ను అందుకున్నాడు.ఊపిరి పీల్చుకుని హడావుడిగా పరీక్ష హాల్‌లోకి వెళ్లాడు.సరిగ్గా సమయానికి చేరుకున్నాడు.
ఈ ఘటనపై ఆ అభ్యర్థి మీడియాతో మాట్లాడటానికి నిరాకరించాడు.కానీ, ఈ తతంగానికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది.నెటిజన్లు ఈ వీడియో చూసి షాక్ అవుతూనే నవ్వుకుంటున్నారు.“ఇలా కూడా జరుగుతుందా?”, “నిజంగా విచిత్రం” అంటూ కామెంట్లు పెడుతున్నారు.మొత్తానికి గద్ద చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.







