జపాన్( Japan ) తీరానికి దగ్గరలో సముద్రం అడుగున ఓ వింత కట్టడం బయటపడి ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది.యోనాగుని స్మారక చిహ్నం( Yonaguni Monument ) అని పిలిచే ఈ భారీ రాతి నిర్మాణం, జపాన్‌లోని ర్యూక్యు దీవుల దగ్గర సముద్రంలో దాదాపు 82 అడుగుల లోతున ఉంది.1986లో దీన్ని మొదటిసారిగా గుర్తించారు.అప్పటినుంచి ఇది శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు ఓ పెద్ద మిస్టరీగా మారిపోయింది.
యోనాగుని స్మారక చిహ్నం సముద్రంలో దాదాపు 82 అడుగుల లోతున, సుమారు 90 అడుగుల ఎత్తులో నిటారుగా నిలబడి ఉంది.దాని డిజైన్ చూస్తే మెట్లు మెట్లుగా, గుండ్రంగా లేకుండా చతురస్రాకారంగా ఉండటంతో ఇది మనుషులే కట్టి ఉంటారని చాలామంది నమ్ముతున్నారు.
కొందరు పరిశోధకులు మాత్రం ఇది ఎప్పుడో కనుమరుగైన ప్రాచీన నాగరికతకు చెందిన మహా నగర అవశేషం కావచ్చని అనుకుంటున్నారు.
ఈ రాయి వయస్సును పరీక్షించగా అది 10,000 సంవత్సరాల కంటే కూడా పాతదని తేలింది.ఇది నిజంగా షాకింగ్ విషయం.ఎందుకంటే ఈ కట్టడం మనుషులు కట్టి ఉంటే, వ్యవసాయం కూడా మొదలుకాకముందే, అంటే దాదాపు 12,000 ఏళ్ల క్రితమే ఇంత పెద్ద కట్టడాలు కట్టే టెక్నాలజీ వాళ్లకు ఉండేదా అని ప్రశ్నలు మొదలయ్యాయి.
ఇప్పటివరకు మనకు తెలిసిన చరిత్ర ప్రకారం మనుషులు వ్యవసాయం చేయడం మొదలుపెట్టాకే పెద్ద పెద్ద కట్టడాలు కట్టడం స్టార్ట్ చేశారు.కానీ యోనాగుని పిరమిడ్ మాత్రం అంతకంటే ముందే ఓ అడ్వాన్స్‌డ్ సొసైటీ ఉండేదని చెప్పకనే చెబుతోంది.దీంతో కొందరు దీన్ని అట్లాంటిస్ లాంటి మాయమైన నగరంతో పోలుస్తున్నారు.
అయితే అందరూ దీన్ని మనుషులు కట్టారని ఒప్పుకోవడం లేదు.
కొంతమంది సైంటిస్టులు మాత్రం ఇది సముద్రపు అలలు, నీటి ప్రవాహాల వల్ల సహజంగా ఏర్పడిన రాతి నిర్మాణం అని వాదిస్తున్నారు.రీసెంట్‌గా జో రోగన్ ఎక్స్‌పీరియన్స్ పాడ్‌కాస్ట్‌లో రచయిత గ్రాహం హాన్కాక్, పురావస్తు శాస్త్రవేత్త ఫ్లింట్ డిబ్బిల్ దీని గురించి చర్చించడంతో మళ్లీ ఈ టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది.
డిబ్బిల్ ఇది సహజంగా ఏర్పడిన శిల అని నమ్ముతున్నాడు.కానీ హాన్కాక్ మాత్రం దీన్ని ఖచ్చితంగా మనుషులే నిర్మించారని వాదిస్తున్నాడు.
ఎందుకంటే అక్కడ మెట్లు, పెద్ద రాళ్లు (మెగాలిత్‌లు), వంపులు, మనిషి ముఖంలా చెక్కిన ఆకారం లాంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన బలంగా చెబుతున్నాడు.
సహజంగా ఏర్పడిందా లేక మనుషులే కట్టారా అనేది తేలకపోయినా, యోనాగుని స్మారక చిహ్నం మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన నీటి అడుగున ఉన్న రహస్యాలలో ఒకటిగా మిగిలిపోతుంది.