పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) స్టార్ డైరెక్టర్ సుజీత్( Director Sujeeth ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాపై( OG Movie ) ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత కొరవడినా అభిమానులు మాత్రం ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం కూడా గట్టి పోటీ నెలకొనగా డిజిటల్ రైట్స్ ఏకంగా 100 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.
పవన్ మూడు వారాల పాటు డేట్స్ కేటాయిస్తే ఓజీ మూవీ షూట్ పూర్తవుతుంది.
ప్రముఖ ఓటీటీ( OTT ) సంస్థ ఓజీ సినిమాకు ఉన్న క్రేజ్ చూసి భారీ మొత్తం ఆఫర్ చేసి ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.ఈ సినిమా రైట్స్ లెక్క తెలిసి పవన్ క్రేజ్ కు ఇంతకంటే ప్రూఫ్ కావాలా? అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వరుస విజయాలతో పవన్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.

అయితే వరుసగా సినిమాల్లో నటించకపోవడం పవన్ కళ్యాణ్ కు ఒక విధంగా మైనస్ అవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఓజీ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలయ్యే ఛాన్స్ ఉండగా సుజీత్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు.ఓజీ సినిమాలో శ్రియారెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఓజీ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు.

ఓజీ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఆ బ్యానర్ కు కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు.ఓజీ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సినిమాల విషయంలో పవన్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.పవన్ రెమ్యునరేషన్ 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.