రామ్ ప్రకాష్ గున్నం( Ram Prakash Gunnam ) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా సినిమా చెరసాల.( Cherasala ) ఎస్.రాయ్ క్రియేషన్స్ పతాకంపై కథ్రి అంజమ్మ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.కథ్రి అంజమ్మ, షికారలు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు.
ఇందులో శ్రీజిత్, నిష్కల, రమ్య తదితరులు ముఖ్య పాత్రలో నటించారు.కాగా రొమాంటిక్ హారర్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి తాజాగా విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కథ:
వంశీ (శ్రీజిత్),( Vamshi ) ప్రియ(నిష్కల)( Priya ) ఇద్దరూ ప్రేమించుకుంటారు.అయితే వారికి మరో కొంత మంది స్నేహితులు కూడా ఉంటారు.వీరంతా కలిసి ఎటైనా వెళ్లి సరదాగా గడపలానుకుంటారు.అయితే ఈ నేపథ్యంలో ఒక అందమైన పెద్ద బంగ్లాలోకి వెళతారు.అక్కడే బసచేసి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు.
అనుకున్నట్టే అందులో ఉండిపోయి సరదాగా గడిపేస్తుంటారు.ఈ క్రమంలో ఆ బంగ్లాలో కౌసల్య అనే వివాహిత చనిపోయి ఆత్మ తిరుగుతోందని వారికి ఇంటి వాచ్ మెన్ ద్వారా తెలుస్తుంది.
అసలు ఆ కౌసల్య ఎవరు? నేను ఎవరు ఎందుకోసం చంపారు? ఆ ఆత్మ వారందరిని ఇబ్బంది పెట్టిందా? చివరికి ఏం జరిగింది ఆ ఆత్మను వాళ్ళు ఏం చేశారు అన్న విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
హారర్ డ్రామా సినిమాలు( Horror Drama Movie ) ఎప్పుడూ ఆడియన్స్ కు థ్రిల్ ను ఇస్తాయి.ఇదే కథాంశంతో ఇప్పటి వరకు చాలా సినిమాలు విడుదల అయ్యాయి.దర్శకుడు కం హీరో ఇందులో వన్ ఆఫ్ ధి రామ్ ప్రకాశ్ గున్నం ఇదే చేశారు.
ఇందులో హారర్, రొమాన్స్ కి తోడుగా కామెడీతో డ్రామాను బాగా పండించాడు.ఎక్కడా బోర్ లేకుండా సామెతలతో కూడిన సంభాషణలు పలికించి ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగారు.అయితే కథ రొటీన్ యే అయినప్పటికీ కథను నడిపించడానికి కామెడీ స్క్రీన్ ప్లేను ఎంచుకుని మంచి డైలాగులు రాసుకున్నారు.దాంతో ఎక్కడా ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవ్వరు.
భార్య భర్తల బంధం చాలా పవిత్రమైనది దాన్ని అనుమానాలతోనూ, అపార్థాలతోనూ అర్ధాంతరంగా ముగించరాదు.అప్యాయంగా గడపడంతోనే నిండు జీవితానికి సార్థకత ఉంటుందనే అనే అంశాన్ని ఇందులో బాగా చూపించారు.
అలాగే పవిత్రమైన స్త్రీ తన మాంగళ్యాన్ని ఎలా కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగం చేసిందనేది ఇందులో చూపించారు.

టెక్నీకల్:
ఇందులో టెక్నికల్ పనితీరు కూడా బాగానే ఉంది.కెమెరా వర్క్స్ బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.
హర్రర్ నేపథ్యంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో బాగానే ఆకట్టుకున్నారు.సంగీతం పర్వాలేదు.
సినిమాటోగ్రఫీ బాగుంది.బంగ్లాలో నటీనటుల మధ్య వుండే బాండింగ్ ను, కామెడీ సన్నివేశాలను బాగా చిత్రీకరించారు.నిడివి ఇంకాస్త తగ్గించాల్సింది.నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను ఎంతో క్వాలిటీగా నిర్మించారు.
నటీనటుల పనితీరు:
హీరోగా నటించిన శ్రీజిత్ తనదైన నటనతో మెప్పించే ప్రయత్నం చేసాడు.హీరోయిన్ నిష్కల ఆన్ స్క్రీన్ లుక్ బాగుందని చెప్పాలి.
తన గ్లామర్ తో చిట్టి పొట్టి నిక్కరులో కుర్రకారును గిలిగింతలు పెట్టింది.అందంతో కుర్రకారుల్ని కట్టిపడేసింది.ఇక మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.