ఇంట్లో చిన్న చిన్న కీటకాలు ( Insects )కనిపిస్తూ ఉంటాయి.వాటిని చూస్తేనే భయపడిపోతాము.
మనం చేసే తొందరలో అవి వచ్చి కుడతాయి.విషపు పురుగులు అయితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
కానీ సాధారణమైనవైతే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.అలాగే చర్మం కూడా పాడవ్వకుండా ఉంటుంది.
కీటకాల కాటుకు సాయపడే కొన్ని ముఖ్యమైన నూనెలు కూడా ఉన్నాయి.మన అందరి ఇళ్లల్లో చిన్న చిన్న కీటకాలు, దోమలు ఉంటాయి.
కొన్నిసార్లు ఇళ్లల్లోకి తేలు, పాములు కూడా వస్తాయి.చిన్న చిన్న పురుగులు కరిచిన, విషపురుగులు కాటేసిన వెంటనే ఆస్పత్రికి పరుగులు తీస్తాము.
విషపురుగులు కరిస్తే ఆస్పత్రికి వెళ్లడం మంచిది.కానీ చిన్న పురుగులు కరిస్తే వెళ్లనవసరం లేకుండానే ఇంట్లోనే ముఖ్యమైన నూనెలు, మందులను ఉపయోగించడం వలన చర్మ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్ 🙁 Eucalyptus essential oil )
మంచి లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.ఇది యాంటీ ఇన్ఫ్లమెటరీ లక్షణాలను కలిగి ఉంది కాబట్టి మీ చర్మం పై కీటకాల కాటు వలన కలిగే మంటను తగ్గించడంలో, చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అలాగే ఇది యాంటీసెప్టిక్ గా కూడా పనిచేస్తుంది.

తులసి ఆయిల్: ( Basil oil )
తులసి ఆయిల్ కూడా దీని కోసం బాగా పనిచేస్తుంది.తులసిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీటకాలు కరిచిన చర్మాన్ని శాంత పరచడంలో సహాయపడతాయి అలాగే నూనె సువాసన కీటకాలను కూడా తిప్పికొడతాయి.

పెప్పర్మెంట్ ఆయిల్: ( Peppermint Oil )
చర్మంపై పెప్పర్మెంట్ ఆయిల్ అప్లై చేయడం వలన కీటకాలను తిప్పి కొట్టడానికి ఉత్తమమైన మార్గమని చెప్పవచ్చు.ఈ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి.

లావెండర్ ఆయిల్ 🙁 Lavender Oil )
లావెండర్ ఆయిల్ ను ఉపయోగించడం వలన మీ ప్రభావిత చర్మ ప్రాంతాన్ని ఉపశమనం చేస్తుంది.