సంతోష్ శోభన్.( Sangeeth Shobhan ) ఈ పేరు ఇప్పటి వరకు ఎవరికి పెద్దగా తెలియదు.
కానీ ఇతనికి గట్టి బ్యాగ్రౌండ్ ఉన్న కూడా ఎవరి సపోర్ట్ తీసుకోకుండా టాలీవుడ్ లో ఒక్కో అడుగు వేస్తూ పూర్తి స్థాయి నటుడిగా మారుతున్నాడు.ప్రస్తుతం ఇతడు నటించిన మ్యాడ్ అనే సినిమా( Mad Movie ) ట్రైలర్ యూట్యూబ్ లో టెండింగ్ లో వుంది.
సినిమాలో హీరో ఎవరు ఉన్న కూడా సంగీత్ మాత్రం బాగా హైలెట్ అవుతుండటం విశేషం.తనదైన కామెడీ తో టాలీవుడ్ కి మరొక మంచి కమిడియన్ దొరికినట్టుగా కనిపిస్తున్నాడు సంగీత్.
అయితే సంగీత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదట గోల్కొండ హై స్కూల్ సినిమాలో కనిపించాడు.ఇప్పుడు మ్యాడ్ సినిమాతో ఫుల్ టైం నటుడిగా ఎలివేట్ అవుతున్నాడు.
ఈ సంగీత్ శోభన్ మరెవరో కాదు వర్షం, చంటి, బాబీ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన శోభన్ కుమారుడు.అంతే కాదు ఇప్పటికే హీరోగా టాలీవుడ్ లో చలామణి అవుతున్న సంతోష్ శోభన్ కి( Santosh Shobhan ) స్వయానా తమ్ముడు.సంతోష్ మరియు సంగీత్ ల పెద్ద నాన్న ప్రముఖ కమెడియన్ లక్ష్మీపతి.( Comedian Lakshmipathi ) తన తండ్రి లాగ ఎవరు దర్శకత్వం వైపు అడుగులు వేయకుండా నటన వైపు మొగ్గు చూపారు.
సంతోష్ లుక్స్ వైస్ క్యూట్ గా ఉండటం తో హీరో గా ట్రై చేసుకుంటున్నాడు.కానీ అదిరిపోయే కామెడీ చేయగల సంగీత్ తన పెద్దనాన్న లాగ నవ్వించాలని డిసైడ్ అయిపోయినట్టు ఉన్నాడు.
ఇప్పటికే పలు సినిమాల్లో మరియు యూట్యూబ్ లో కనిపించిన ఈ సంగీత్ త్వరలోనే ఇండస్ట్రీ లో మంచి కమెడియన్ గా ఎదుగుతాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.సంతోష్ శోభన్ హీరో గా వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా సంగీత్ చిన్న చిన్న పాత్రలో నటిస్తూ వస్తున్నాడు.3 రోజెస్, ఒక చిన్న ఫ్యామిలీ లో మంచి పాత్రల్లో నటించాడు.ఇప్పటి వరకు యూట్యూబ్, ఓటిటి లో సందడి చేసిన సంగీత్ ఇకపై వెండి తెరపై ఇకపై నవ్వులు పూయించబోతున్నాడు.