సినిమా రంగం అంటేనే క్రియేటివిటీస్ కు పెట్టింది పేరు.ఫిల్మ్ మేకర్స్ ఆలోచనలు ఎవరి ఊహకూ అందకుండా ఉండాలి.
సినిమాల విషయంలోనూ అలా ఉంటేనే సక్సెస్ అందుతుంది.గతంలో ఎన్నడూ ఎవరూ పట్టుకోని కథను పట్టుకోవాలి.
ఎవరూ ఊహించని ట్విస్టులు పెట్టాలి.అప్పుడే జనాలకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
సినిమా విషయంలోనే కాదు.సినిమా ప్రమోషన్ విషయంలోనూ క్రియేటివ్ గా ఆలోచిస్తారు సినీ జనాలు.
సినిమా మీద హైప్ క్రియేట్ చేయాలంటే రకరకాల ప్రయత్నాలు చేయాలి.అప్పుడే జనాలకు సినిమా చూడాలి అనే కుతూహలం కలుగుతుంది.
ఇప్పుడే కాదు.గతంలోనూ సినిమాల ప్రమోషన్ విషయంలో చక్కటి క్రియేటివిటీ కనబర్చారు అలా నాటి ఫిల్మ్ మేకర్.రొటీన్ కు భిన్నంగా ఆలోచించారు.సినిమాలు విడుదలై 25, 50 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ సినిమాల గురించి రకరకాల పద్దతుల్లో యాడ్స్ పబ్లిష్ చేశారు.
అందులో ముఖ్యమైనది ఆదర్శ కుటుంబం.ఈ సినిమా 1969లో విడుదల అయ్యింది.25 వసంతాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమాకు సబంధించిన యాడ్ చాలా క్రియేటివ్ గా తయారు చేశారు.పావలా నాణేనికి ఓ వైపు రజతోత్సవం అని వేశారు.
మరోవైపు అక్కినేని చిత్రాన్ని వేశారు.పావలా బిల్లపై 25 అని ప్రింట్ ఉంటుంది కాబట్టి.
ఈ సినిమాకు 25 సంవత్సరాలు వచ్చాయి అని చెప్పడమే ఈ యాడ్ ఉద్దేశం.

అటు అక్కినేని నాగేశ్వర్ రావు నటించి మరో సినిమా బంగారు కుటుంబం.ఈ సినిమా విడులై 50 ఏండ్లు నిండాయి.దీనికి కూడా చాలా క్రియేటివ్ గా ఆలోచించి యాడ్ తయారు చేశారు.
ఈ సినిమా గురించి ప్రమోట్ చేస్తూ స్వర్ణోత్సవం సందర్భంగా 50 పైసల బిల్లను యాడ్ మాదిరిగా రూపొందించారు.ఓ వైపు అక్కినేని బొమ్మ.మరోవైపు 50 పైసలు ముద్రించారు.అంటే ఈ సినిమాకు 50 వసంతాలు నిండాయిన ఈ కాయిన్ ద్వారా వెల్లడించారు సినీ దర్శకులు.
అప్పట్లో జనాలకు ఈ రెండు యాడ్స్ తెగ నచ్చాయి.యాడ్ తయారు చేసిన వ్యక్తి క్రియేటివిటీని సినీ జనాలు ఎంతో మెచ్చుకున్నారు.