ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందంటే అందులో అందరి కంటే ఇద్దరికే క్రెడిట్ బాగా దక్కుతుంది.వారే హీరో, డైరెక్టర్.
కథను బాగా చెప్పడంలో డైరెక్టర్ కష్టపడితే, యాక్టింగ్ తో ఆ కథను మరింత అట్రాక్టివ్ గా సగటు ప్రేక్షకుడికి కనిపించేలా చేసే సత్తా హీరోకి మాత్రమే ఉంటుంది.ఈ రెండు పనులు చేయగల టాలెంట్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో వారి కంటే తోపు మరొకరు లేరని చెప్పవచ్చు.
అలాంటి వారిలో మన సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పవచ్చు.భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే రిషబ్ శెట్టి( Rishab Shetty ) వంటి కొందరు సినిమాల్లో నటించడమే కాకుండా సొంతంగా తమ సినిమాలను డైరెక్ట్ చేసుకొని హిట్స్ కొట్టారు.
మరికొందరు కూడా సొంత దర్శకత్వంలో సినిమాలు చేసి అలరించారు.ఆ హీరో కమ్ డైరెక్టర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
• రిషబ్ శెట్టి

కాంతారా మూవీ( Kantara ) సినిమా ఒక మాస్టర్ పీస్ అని చెప్పలేం.కానీ ఆ సినిమా కన్వే చేసిన మెసేజ్ మాత్రం బాగుంది.ఈ మూవీ మంచి కథతో, వరాహ రూపం పాటతో చాలామందిని ఆకట్టుకుంది.రిషబ్ శెట్టి దీన్ని డైరెక్ట్ చేయడంతో పాటు హీరోగా నటించి ఆకట్టుకున్నాడు.
• ధనుష్

తమిళ భాషా కామెడీ డ్రామా ”పా పండి (2017)” సినిమాని నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్( Dhanush ) డైరెక్ట్ చేశాడు దీనిని ప్రొడ్యూస్ కూడా చేశాడు అంతేకాదు హీరోగా నటించి మల్టీ టాలెంట్ ను చూపించాడు.
• విశ్వక్ సేన్

ఫలక్ నుమా దాస్ 2017 మలయాళంలో హిట్ అయిన అంగమలీ డైరీస్కి రీమేక్.దీనిని విశ్వక్ సేన్( Vishwaksen ) డైరెక్ట్ చేశాడు.దాంట్లో నటించాడు కూడా అయితే అతనికి సరిగ్గా డైరెక్షన్ చేయడం రాక మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
• పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఫస్ట్ నుంచి డైరెక్టర్ అవ్వాలనుకునేవాడు కానీ మొదట హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.హీరోగా మస్తు సక్సెస్ అయినప్పటికీ డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని జానీ సినిమా తీశాడు.దానికి కథ కూడా తానే అందించాడు.ఈ మూవీ అతడికి భారీ ఫ్లాప్ అందించింది.ఆ తర్వాత అతడు ఏ సినిమానూ డైరెక్ట్ చేయలేదు.
• ఆర్ మాధవన్

ఆర్ మాధవన్( R Madhavan ) బయోగ్రాఫికల్ డ్రామా మూవీ “రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్”ని అద్భుతంగా డైరెక్ట్ చేశాడు.ఈ మూవీలోని టైటిల్ రోల్ కూడా అతనే చేశాడు.ఇది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
పైన పేర్కొన్న వారితో పాటు యాక్షన్ హీరో విశాల్ కూడా తన సినిమాని సొంతంగా డైరెక్ట్ చేసుకున్నాడు.ఆ మూవీ పేరు తుప్పరివాలన్ 2 (డిటెక్టివ్ 2).ఇక అడివి శేషు కర్మ, కిస్ సినిమాలకు దర్శకత్వం వహించడంతోపాటు హీరోగా నటించాడు.