కపూర్ ఫ్యామిలీ లో పుట్టిన శశి కపూర్( Sashi Kapoor ) ఎంతో మంచి అందగాడు.అయన అందానికి అప్పట్లో ఒక రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.
అయితే ఆయన ఫోటోలు రెండు శోభన్ బాబు గారు( Sobhan Babu ) సూట్ కేసు లో పెట్టుకునే వారట.అందుకు ఒక పెద్ద కథ కూడా ఉంది.
అదేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.శోభన్ బాబు దాచుకున్న ఒక ఫొటోలో సన్నగా మరియు లావుగా ఉన్న శశి కపూర్ ఫోటోలు ఉండేవి .అయితే ఒక ఫోటో లో సన్నగా, రెండో ఫొటోలో లో అంత లావుగా ఎందుకు ఉన్నారు? ఆయన అలా అవ్వడానికి కారణం ఉంది.శశి కపూర్ రెండు ఫోటోల వెనుక ఒక మంచి ప్రేమ కథ ఉంది.

శశి కపూర్ భార్య జెన్నిఫర్ కెండాల్( Jennifer Kendal ) ఒక బ్రిటిష్ నటి.వీరిది ప్రేమ వివాహం.దేశం కానీ దేశం, భాష వేరు, సంప్రదాయాలు వేరు.కానీ ఇవేవి లెక్క చెయ్యలేదు ఆమె.ఆయన మీద ప్రేమతో, నమ్మకంతో సంతోషంగా పెళ్ళాడి, భారత దేశంలో అడుగు పెట్టింది.కపూర్ ఫామిలీలో ఉన్న ఊబకాయం( Obesity ) తన భర్తకు రాకూడదని ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది.
ఆయన్ను వెజిటేరియన్ గా మార్చింది.ప్రతి రోజు స్విమ్మింగ్, జిం చేయించేది.
ఆమె ఉన్నంత వరకు ఆయన అందగాడే.కానీ దురదృష్టవశాత్తు ఆమె కాన్సర్ బారిన పడి మరణించింది.
ఆమె చనిపోయిన తరువాత శశి కపూర్ ఆరోగ్యం పై శ్రాధ పెట్టడం మానేశారట.

తాను ఎంతగానో ప్రేమించిన జెన్నిఫర్ లేని లోకాన్ని ఊహించుకోలేకపోయారు శశి కపూర్.నలుగురు పిల్లలను ఆయన చేతిలో పెట్టి అనారోగ్యం శశి కపూర్ కి బహుమతిగా ఇచ్చి ఆమె వెళ్ళిపోయింది.ముందు అందం, తరువాత ఆరోగ్యం, మెల్ల మెల్లగా ఒక్కొక్కటి నశించాయి.
శశి కపూర్ రెండు ఫోటోల వెనుక ఉన్న ఈ కథ శోభన్ బాబు గారికి తెలుసో లేదో కానీ రోజు ఆ ఫోటోలు చూస్తూ, నేను ఇలా అవ్వకూడదు అనుకునేవారట ఆయన.అందుకే ఆహరం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకొనేవారట.