మీ చేతులు కోమ‌లంగా మారాలా? అయితే ఈ ఒక్క చిట్కా చాలు!

Best Remedy For Smooth And Beautiful Hands , Best Remedy , Smooth Hands , Hands , Skin Care , Skin Care Tips , Beauty , Beauty Tips

సాధార‌ణంగా కొంద‌రి ముఖం ఎంతో అందంగా మెరిసిపోతుంటుంది.కానీ, చేతులు మాత్రం చాలా ర‌ఫ్‌గా, డ్రైగా ఉంటాయి.

 Best Remedy For Smooth And Beautiful Hands , Best Remedy , Smooth Hands , Hands-TeluguStop.com

ముఖ్యంగా ఆడ‌వారు త‌మ చేతుల‌ను ఎంత‌ అపురూపంగా చూసుకుంటారు.కానీ, వంట చేయ‌డం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఇంటిని శుభ్ర‌ప‌ర‌చ‌డం వంటి రోజువారీ పనుల కారణంగా చేతులు పొడిగా, నిర్జీవంగా మారుతుంటాయి.

దాంతో చేతుల‌ను కోమ‌లంగా మార్చుకోవ‌డం కోసం ఎన్నెన్నో క్రీములు, లోష‌న్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు యూస్ చేస్తారు.

అయితే న్యాచుర‌ల్‌గా కూడా పొడిబారిన చేతుల‌ను మృదువుగా, అందంగా మార్చుకోవ‌చ్చు.

అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా బాగా పండిన అర‌టి పండును తీసుకుని తొక్క తొల‌గించి స్లైసెస్‌గా క‌ట్ చేసుకోవాలి.ఈ అర‌టి పండు స్లైసెస్‌ను మిక్సీ జార్‌లో వేసి వాట‌ర్ పోయ‌కుండా పేస్ట్ చేసుకోవాలి.

Telugu Tips, Remedy, Skin Care, Skin Care Tips, Smooth-Telugu Health Tips

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల అర‌టి పండు పేస్ట్‌, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ నిమ్మ ర‌సం వేసుకుని అన్ని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో చేతుల‌ను శుభ్రంగా క్లీన్ చేసుకుని.అప్పుడు త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని అప్లై చేసుకోవాలి.

ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాలు పాటు చేతుల‌ను ఆర‌బెట్టుకుని.

ఆపై మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ కూల్ వాట‌ర్‌తో క్లీన్‌గా వాష్‌ చేసుకోవాలి.ఇప్పుడు త‌డిలేకుండా చేతుల‌ను తుడిచి.

ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్ లేదా లోష‌న్‌ను రాసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు ఖాళీ స‌మ‌యంలో చేస్తే గ‌నుక‌.

చేతులు కోమ‌లంగా, అందంగా మార‌తాయి.మ‌రియు చేతుల‌పై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్ సైతం తొల‌గిపోతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube