ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే వారం రోజుల్లో ముఖం తెల్లగా మెరిసిపోతుంది!

సాధారణంగా కొందరు తమ ముఖ చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం తెగ ఆరాటపడుతుంటారు.ఇందులో భాగంగానే మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్, సీరం వంటి వాటిని కొనుగోలు చేసి వాడుతుంటారు.

 Follow This Simple Tip And Your Face Will Turn White In A Week! Simple Tip, Skin-TeluguStop.com

వాటి వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అన్నది పక్కన పెడితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా మాత్రం మీ చర్మాన్ని వారం రోజుల్లో తెల్లగా మెరిపిస్తుంది.ఆ సింపుల్ చిట్కా ఏంటి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక కీర దోసకాయ తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, ఆఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు వేసుకుని కలుపుకోవాలి.

చివరిగా సరిపడా కీర దోసకాయ జ్యూస్ ను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకొని కనీసం ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజ‌ర్ ను రాసుకోవాలి.

రోజుకు ఒక్కసారి ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చ‌ర్మ ఛాయ మెరుగుపడుతుంది.

వారం రోజుల్లో స్కిన్ వైట్ గా, బ్రైట్ గా మారుతుంది.ఈ చిట్కా ను పాటించడం వల్ల చ‌ర్మం స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది.మొండి మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా దూరం అవుతాయి.

మరియు స్కిన్ షైనీగా సైతం మెరుస్తుంది.కాబట్టి స్కిన్ వైట్నింగ్ కోసం ప్రయత్నిస్తున్న వారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube