ఈ డ్రింక్ తాగితే డయాబెటిస్ సమస్య దూరం అవ్వడం ఖాయం..!

శరీరంలో ఇన్సులిన్( Insulin ) స్థాయిలో గణనీయంగా పడిపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి చాలా పెరిగిపోతూ ఉంటాయి.ఇలా శరీరంలో గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోవడం పాదాల్లో నాడులు దెబ్బ తినేందుకు రక్తనాళాల్లో సమస్యలకు కళ్లు, గుండె,కిడ్నీ వంటి ముఖ్యమైన అన్ని అవయవాల మీద చెడు ప్రభావం పడుతుంది.

 If You Drink This Drink, The Problem Of Diabetes Will Surely Go Away, Diabetes,-TeluguStop.com

అందుకే డయాబెటిస్ తో బాధపడేవారు తప్పనిసరిగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుకోవాలి.ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరిని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్న వ్యాధి డయాబెటిస్ అని కచ్చితంగా చెప్పవచ్చు.

దీని గురించి రకరకాల పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి.
.

Telugu Diabetes, Eyes, Green Tea, Tips, Heart Kidney, Kombucha-Telugu Health Tip

ఇటీవల జరిపిన అధ్యయనంలో రక్తంలో చక్కెర స్థాయిని( Diabetes ) తగ్గించే పానీయం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే >కొంబుచా అనే పానీయంతాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చని కొత్త అధ్యయనంలో తెలిసింది.ఈ డ్రింక్ తాగిన టైప్-2 డయాబెటిస్ పేషెంట్లలో నాలుగు వారాల్లో రక్తంలో చక్కెర స్థాయి తగ్గినట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు గుర్తించారు.ఫెర్మెంట్ చేసిన ఈ టీలో అభివృద్ధి చెందే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుందని గుర్తించారు.

Telugu Diabetes, Eyes, Green Tea, Tips, Heart Kidney, Kombucha-Telugu Health Tip

ముఖ్యంగా చెప్పాలంటే కొంబుచా ( Kombucha )2 వేల సంవత్సరాల ప్రధానమైన పానీయం.ఇందులో కేవలం టీ మాత్రమే ఉంటుందని అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.ఇప్పుడు ఈ డ్రింక్ చాలా ప్రాచూర్యంలో ఉంది.అందుకే ప్రపంచ వ్యాప్తంగా దీని వ్యాపారం బిలియన్లకు చేరింది.క్రీస్తుపూర్వం నుంచి దీని తయారీకి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి.దీనికి అతి పురాతన పానీయంగా గుర్తింపు కూడా ఉంది.

బ్లాక్ లేదా గ్రీన్ టీ ఏదైనా కావచ్చు.పులిసిన ఈ పానీయం లో ప్రోబయోటిక్స్ ఉంటాయి.

దీన్ని తయారు చేసిన తర్వాత వారం నుంచి నెల రోజుల వరకు పులియబెడతారు.చివరికి కొద్దిగా కార్బోనెట్ అయిన పానీయం అవుతుంది.

రుచికి కొద్దిగా వెనిగర్ మాదిరిగా పుల్లగా ఉంటుంది.ఇందులో ఆల్కహాల్ 0.5% కంటే తక్కువగా ఉంటుంది.దీనిని ఆల్కహాల్ రాహిత పానీయంగా మార్కెట్లో విక్రయిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube