ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నా, పెద్దా తేడా లేకుండా మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు.అయితే మధుమేహం సమస్య ఉన్న వాళ్ళు మాత్రం తాము తీసుకొనే ఆహారంపు అలవాట్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
జాగ్రత్త వహించాక పోతే వాళ్ళ శరీరంలో ఉన్న రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరిగిపోతుంది.అయితే రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్ లో లేకపోతే కిడ్నీ వ్యాధులు, నరాల సమస్యలు, కంటి సమస్యలు లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి.
అయితే డయాబెటిక్ పేషెంట్స్ కు తమ ఆహారం విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి.అయితే ఎక్కువగా పండ్లలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటాయని అందుకే వాటిని తినకూడదని చాలామంది అంటుంటారు.
ఎందుకంటే పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరుగుతుందని చాలామంది మధుమేహం పేషెంట్లు ఆందోళన చెందుతారు.కానీ వైద్య నిపుణులు మాత్రం డయాబెటిస్ ఉన్నప్పటికీ కూడా పండ్లు తినవచ్చు అని చెబుతున్నారు.
అయితే గ్లేసేమిక్ ఇండెక్స్ ఉండే పండ్లను మాత్రమే తీసుకోవాలి.
అయితే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఏ పండ్లను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఆరంజ్ ను తీసుకోవడం మంచిది.ఎందుకంటే ఆరెంజ్ లో పుష్కలంగా విటమిన్ ఉంటుంది.
ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.ఇందులో గ్లేసేమిక్ ఇండెక్స్ లెవెల్ ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్ నిరభ్యంతరంగా వీటిని తినవచ్చు.

అలాగే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు బత్తాయి పండును కూడా తీసుకోవచ్చు.ఎందుకంటే ఇందులో విటమిన్ సి, పీచు ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.అలాగే ఇందులో గ్లైసేమిక్ ఇండెక్స్ 40 – 43 గా ఉంటుంది.అలాగే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్లు చెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఆపిల్ లాంటి పండ్లను తినవచ్చు.
ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి.







