వయసు పైబడే కొద్ది జుట్టు తెల్లబడటం( White hair ) సర్వసాధారణం.అయితే కొందరి జుట్టు 60 లోనూ నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తూ కనిపిస్తుంది.
అలాంటి వారిని చూస్తే కాస్త అసూయ పుట్టడం సహజం.కానీ అలాంటి జుట్టును మీరు పొందవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ గ్రేట్ గా సహాయపడుతుంది.నెలకు కేవలం రెండంటే రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే తెల్ల జుట్టు మీ దరిదాపుల్లోకి కూడా రాదు.
మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ బియ్యం, వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ) వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆరు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ ను వేసుకోవాలి.
అలాగే ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసి కలుపుకోవాలి.
చివరగా టీ డికాక్షన్ ను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నాలుగు గంటల పాటు వదిలేయాలి.
ఆపై జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే జుట్టులో మెలనిన్ ఉత్పత్తి( Melanin ) తగ్గకుండా ఉంటుంది.దాంతో జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.తెల్ల జుట్టును సహజంగానే ఎవాయిడ్ చేయాలని భావించే వారికి ఏ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.నెలకు కేవలం రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే తెల్ల జుట్టు మీ దరిదాపుల్లోకి రాదు.
కృత్రిమ రంగుల పై ఆధార పడాల్సిన అవసరం ఉండదు.