దళితులను దగా చేస్తున్న బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీలో చేరిన 40మంది

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ జెండాను సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు.రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన 40 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి కండువా కప్పారు.

 40 People Who Joined The Brs-congress Party Who Are Deceiving The Dalits-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తుందని తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పడం జరిగిందన్నారు.

దళిత బంధు పేరిట అందరికీ ఇవ్వకుండా దళిత బంధు పేరుతో మభ్యపెట్టడం జరుగుతుందన్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇందిరమ్మ ఇండ్లు విద్యుత్ చార్జీల మాఫీ ఎన్నో రకాలైన సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు.ఉద్యోగాలలో సైతం దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube