విజయశాంతి. 25 ఏండ్ల పాటు తెలుగు తెరను ఏలిన నటి.టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ ఆమె జోడీ కట్టింది.హీరోలకు మించి నటన, ఫైట్స్, డ్యాన్స్ తో అదరగొట్టింది.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి లేడీ సూపర్ స్టార్ గా మారింది.తెలుగులో విజయశాంతి చేసినన్ని పవర్ ఫుల్ సినిమాలు మరే హీరోయిన్ చేయలేదని చెప్పుకోవచ్చు.
అయితే విజయశాంతి తెలుగు అమ్మాయి అయినా ఓ విషయంలో మాత్రం చాలా పూర్ అని చెప్పుకోవచ్చు.ఇంతకీ తను దేంటో వెనుకబడిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
విజయశాంతి 1980లో తెలుగులు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.కిలాడీ కృష్ణుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.అయితే డబ్బింగ్ మాత్రం తను చెప్పుకునేది కాదు.సుమారు 17 ఏండ్ల పాటు విజయశాంతికి డబ్బింగ్ ఆర్టిస్టులే వాయిస్ ఇచ్చేవవారు.
ఆమె తొలిసారి దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన సినిమాకు డబ్బింగ్ చెప్పుకుంది.ఆ సినిమా మరేదో కాదు.
ఇండస్ట్రీ హిట్ సాధించిన ఒసేయ్ రాములమ్మ.ఈ సినిమాకు ఫస్ట్ టైం వాయిస్ ఇచ్చింది.
అంతకు ముందు తను ఎన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా డబ్బింగ్ మాత్రం తను చెప్పేది కాదు.యూపీ పూలందేవి జీవితం ఆధారంగా కొన్ని మార్పులు చేర్పులతో ఈ సినిమా కథ రెడీ చేశారు.సినిమా షూటింగ్ అయ్యాక రాములమ్మ క్యారెక్టర్ లో విజయశాంతి ఒదిగిపోయిన విషయం తనకు చాలా నచ్చింది.ఈ సినిమా కనీ వినీ విజయం సాధించడం ఖాయం అనుకున్నాడు.
ఈ సినిమా కోసం మరేదైనా ప్రయత్నం చేయాలనుకున్నాడు.అందులో భాగంగానే అప్పటి వరకు డబ్బింగ్ చెప్పని విజయశాంతితో డబ్బింగ్ చెప్పించాలి అనుకున్నాడు.ఆమె తన పాత్రకు డబ్బింగ్ చెప్తే మరింత నేచురల్ గా ఉంటుందనుకున్నాడు.విషయం విజయశాంతికి చెప్పి ఓకే చెప్పించాడు.అటు డబ్బింగ్ చెప్తున్నంత సేపు తను అక్కడే ఉన్నాడు కూడా.మొత్తంగా విజయశాంతి వాయిస్ ఈ సినిమా క్యారెక్టర్ కు అదనపు అసెట్ గా మారింది.
సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది.