సౌత్ ఇండియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న దర్శకులలో అట్లీ( Director Atlee ) ఒకరు.జవాన్ సినిమాతో అట్లీ బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన బేబీ జాన్ మూవీ( Baby John Movie ) మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అట్లీ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో( The Great Indian Kapil Show ) అనే షోలో పాల్గొని షోలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కథ చెప్పడం కొరకు మీరు ఎవరినైనా స్టార్ హీరోను కలిసిన సమయంలో వాళ్లు అట్లీ ఎక్కడ అని అడుగుతారా అని కపిల్ ప్రశ్నించగా ఆ ప్రశ్నలోని మీనింగ్ ను అర్థం చేసుకున్న అట్లీ మీరెందుకు ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారో అర్థమైందని మీ ప్రశ్నకు నా జవాబు ఒక్కటేనని టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామనేది ముఖ్యమని అట్లీ పేర్కొన్నారు.నిజం చెప్పాలంటే డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కు( Director AR Murugadoss ) కృతజ్ఞతలు అని అట్లీ వెల్లడించారు.
తొలిసారి ఒక కథతో మురుగదాస్ వద్దకు వెళ్లిన సమయంలో ఆయన నా స్క్రిప్ట్ గురించి ఆలోచించారు తప్ప నా లుక్ ఎలా ఉందనేది చూడలేదని అట్లీ అన్నారు.నా కథపై నమ్మకం ఉంచి నా తొలి సినిమాకు నిర్మాతగా చేశారని అట్లీ వెల్లడించారు.షోకు ఆహ్వానించి ఈ విధంగా అవమానించడం బాలేదని అట్లీ అన్నారు.ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారని ఆమె అన్నారు.
డిసెంబర్ నెల 20వ తేదీన బేబీ జాన్ మూవీ రిలీజ్ కానుంది.బేబీ జాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.తేరీ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.అట్లీ ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.