టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు సాయి ధరమ్ తేజ్.
ఆమధ్య రోడ్డు యాక్సిడెంట్ అవ్వడంతో సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్న సాయి తేజ్ ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలలో బిజీబిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు చాలా రకాల విషయాలలో వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు సాయి ధరమ్ తేజ్.
మరోవైపు మామయ్య మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) బాటలో నడుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఇప్పటికే చాలామందికి సహాయం చేసి గొప్ప మనసును చాటుకున్న సాయి ధరంతేజ్ తాజాగా మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.
తాజాగా లివర్ సమస్యతో బాధపడుతోన్న ఒక పాపకు తన వంతు సహాయం చేసారు సాయి తేజ్.కాలేయ సమస్యతో బాధపడుతోన్న ఒక చిన్నారికి తన వంతు సహాయం చేశాడు.అలాగే మరికొందరు సాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించాడు.ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు సాయి దుర్గ తేజ్.
హయా అనే అమ్మాయి కాలేయ వ్యాధి సమస్యతో బాధపడుతోంది.ప్రస్తుతం ఆ పాప జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది.నా వంతుగా నేను ఆమె ట్రీట్‌మెంట్ కోసం సాయం చేశాను.దయచేసి మీరు కూడా ఎంతో కొంత డబ్బును ఇవ్వండి.
ప్లీజ్ మీరు చేసే సాయం వల్ల ఆ పాప ప్రాణాలతో ఉంటుంది.ప్రతి డొనేషన్ చాలా ముఖ్యమైనది.
ఆమె ఒక పోరాట యోధురాలు.
మీరు సాయం చేయడం వల్ల ఆ పాప సమస్య నుంచి బయటపడుతుంది అని రాసుకొచ్చాడు మెగా మేనల్లుడు సాయి తేజ్.ఈ సందర్భంగా అభిమానులు స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే సాయి ధరమ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.
ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు సాయి ధరమ్ తేజ్.కేపీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి ( Aishwarya Lakshmi )హీరోయిన్‌గా నటిస్తుంది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది చివరిలో విడుదల కానున్నట్లు సమాచారం.