టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )గురించి మనందరికీ తెలిసిందే.రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
అదే ఊపుతో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాలో నటించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.ఈ సినిమా కూడా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించడంతో ఇప్పుడు అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్.

ఇకపోతే ఫిబ్రవరిలో యాక్షన్ షురూ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి.అయితే తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలిసింది.ఎన్టీఆర్ ను అత్యంత శక్తివంతంగా ఆవిష్కరిస్తూ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ( Directed Prashanth Neel )ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం.

ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.త్వరలో టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా వుండగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న మల్టీ స్టారర్ వార్ 2 సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది.ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో కూడా నటించనున్నారు ఎన్టీఆర్.ఈయనకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి డైరెక్టర్లు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు.త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.