రైల్వే ట్రాక్ పై కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి.. దూసుకొచ్చిన రైలు.. చివరకు?

కొందరు ప్రేమికులు ఎవరేమనుకున్నా ఫర్వాలేదు అన్నట్లు ప్రపంచాన్నే మర్చిపోతుంటారు.ఈ మధ్య కొంతమంది ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు.

 Man Lost In A Phone Call Brings Train To Complete Halt Video Viral Details, Vir-TeluguStop.com

మరికొందరు ఇదే ప్రేమలో పడి అనూహ్య ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు.తాజాగా, ఇలాంటి ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్( Viral Video ) అవుతోంది.

సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో ఒక యువకుడు రైలు పట్టాలపై( Railway Track ) కూర్చొని ప్రేయసితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.ఆయన ముందు, వెనుక ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా పూర్తిగా ఫోన్‌లో లీనమయ్యాడు.

ఇంతలో ఊహించని విధంగా ఓ రైలు పట్టాలపైకి దూసుకురావడం వీడియోలో కనిపిస్తోంది.

అయితే, పట్టాలపై యువకుడు కూర్చొని ఉన్నట్లు గమనించిన రైలు డ్రైవర్ చాలాసేపు హారన్ మోగించాడు.అయినా యువకుడు తన ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు.చివరకు రైలు దగ్గరికి రాగానే ఒక్కసారిగా పక్కకు చూసి షాక్ అయిపోయాడు.

వెంటనే పైకి లేచి నిలబడగానే రైలు డ్రైవర్( Loco Pilot ) తీవ్ర ఆగ్రహంతో కిందకు దిగి యువకుడిని వెంబడించాడు.దాంతో రైలు డ్రైవర్ తనవైపు పరుగెత్తుతూ వస్తున్నాడని గమనించిన యువకుడు వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశాడు.

ఈ సంఘటనను చూసిన నెటిజన్లు యువకుడిపై మంది పడుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ప్రేమలో పడితే ఇంత ఘోరంగా ఉంటుందా అని కామెంట్ చేస్తుంటే.

, మరికొందరు ప్రేమలో పది ప్రాణం మీదకు తెచ్చుకోవడం అంటే ఇదే అని సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.మరికొందరు వారి స్టైల్ లో వివిధ ఎమోజీలతో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube