కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో మాధవన్( Madhavan ) ఒకరనే సంగతి తెలిసిందే.బయటవాళ్లు ఎవరైనా నన్ను కలిసిన సమయంలో మీ వర్క్ నాకెంతో నచ్చింది అని చెబుతుంటారని మాధవన్ తెలిపారు.
అది నాకు ఆనందమే అని మాధవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.కానీ వేదాంత్ విషయంలో మిమ్మల్ని చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉందని మాధవన్ పేర్కొన్నారు.
వేదాంత్ కు( Vedaant ) వేర్వేరు విషయాల గురించి నేను సూచనలు చేస్తుంటానని మాధవన్ పేర్కొన్నారు.అదృష్టమో దురదృష్టమో నువ్వు నా కుమారుడిగా ఉండటం వల్ల సమాజంలో నీకు ఒక గుర్తింపు వచ్చిందని మాధవన్ తెలిపారు.
అందరూ నిన్ను గమనిస్తూ ఉంటారని నువ్వు చిన్న తప్పు చేసినా నేషనల్ న్యూస్ అయిపోతుందని మాధవన్ పేర్కొన్నారు.నీ తోటి వాళ్ల మాదిరిగా ప్రయాణించలేవని మాధవన్ వెల్లడించారు.

ఇష్టమైన కొన్ని పనులు చేయలేవని కానీ తప్పదు ఈ భారాన్ని నువ్వు మోయాల్సి ఉంటుందని చెబుతానని మాధవన్ పేర్కొన్నారు.వేదాంత్ స్పోర్ట్స్ లో రాణించడం అందరి దృష్టిని ఆకర్షించిందని వేదాంత్ ను చూసి మిగిలిన నటీనటుల పిల్లలు ఎన్నో విషయాలను నేర్చుకోవాలని మాధవన్ చెప్పుకొచ్చారు.వేదాంత్ ను ఇతర సెలబ్రిటీ పిల్లలతో పోల్చడం నాకు నా భార్యకు ఇష్టం లేదని మాధవన్ అన్నారు.

అలాంటి వాటిని మేము అంగీకరించాలని అనుకోవడం లేదని మాధవన్ వెల్లడించారు.ఇప్పటివరకు వేదాంత్ తన టాలెంట్ తో విజయం సాధించాడని సోషల్ మీడియాలో నా కొడుకు గురించి వచ్చే మీమ్స్ ను అస్సలు పట్టించుకోనని ఆయన తెలిపారు.మాధవన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
మాధవన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.