టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) దర్శకత్వం వహించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్.( RRR ) ఇందులో రామ్ చరణ్( Ram Charan ) జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) లు కలిసిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కోట్లలో కలెక్షన్స్ ని సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది.అంతేకాకుండా ఈ సినిమా ఆస్కార్ అవార్డులను( Oscar Award ) సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ మూవీలోని నాటు నాటు అనే పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది.దీంతో ఆస్కార్ వేదికగా నాటు నాటు సాంగ్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది.
అయితే ఈ సాంగ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ పాటకు ఫ్యాన్స్ ఉన్నారు.ఎక్కడ చూసినా నాటు నాటు స్టెప్పులకు కాలు కదపకుండా ఉండరేమో అనేలా ఆదరణ దక్కించుకుంది.తాజాగా ఈ పాటను ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్( FIFA ) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
ముగ్గురు ఫుట్ బాల్ దిగ్గజాల పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.ఆ పోస్టర్ లో ఫుట్‌బాల్ దిగ్గజాలు నేయ్‌మార్,( Neymar ) టెవెజ్,( Tevez ) రొనాల్డో( Ronaldo ) ఫోటోలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా క్రియేట్ చేసింది.
వీరి పేర్లలోని తొలి అక్షరాలతో ఎన్టీఆర్ పేరు వచ్చేలా పోస్టర్ ను రూపొందించారు.

ఇందులో ముగ్గురు ఫుట్ బాల్ ఆటగాళ్లు ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ స్టెప్పులు వేస్తున్నట్లు కనిపించారు.ఇది చూసిన జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు.ముగ్గురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్.
ఈ పోస్టర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటోంది.ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు కామెంట్లు మోత మోగిస్తున్నారు.
రియల్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు.మాస్ టైగర్ ఎన్టీఆర్ అంటూ జూనియర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.