ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలలో ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగిపోయింది.కరోనా కారణంగా మన శరీరంలో రోగనిరోధక శక్తి ప్రాముఖ్యత చాలా అవసరమని దాదాపు అందరికీ తెలిసిపోయింది.
అందువలన ఆరోగ్యానికి మంచి చేసే ఆహార పదార్థాలను ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే గరిక గడ్డి లో ఆరోగ్యానికి మరియు అందానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయని, ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు దీనిని ఉపయోగిస్తున్నారు.
మరి దీనిని ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.గరిక గడ్డిని ముద్దగా నూరి, నెయ్యి కలిపి సిద్దామృతం తయారు చేసి చర్మం మీద రాస్తే చర్మం పై పొక్కుల సమస్య దూరమైపోతుంది.
పచ్చి గరికను దంచి ముద్దగా నూరి గాయాల పై ప్రయోగిస్తే గాయాలు త్వరగా మానిపోతాయి.గరిక కు పసుపు కలిపి దంచి ముద్ద చేసి చర్మం పై లేపనంగా రాస్తే దద్దుర్లు, ఎగ్జిమా సమస్యలు దూరమైపోతాయి.

40 రోజుల పాటు ప్రతి రోజు కనీసం రెండు పూటలా విడతకు ఒక టీ స్పూన్ గరిక రసాన్ని ఉదయం, సాయంత్రం తాగితే చర్మవ్యాధులు దూరమైపోతాయి.గరిక గడ్డి వ్రేళ్ళ కషాయాన్ని 30 మిల్లీ లీటర్ల మోతాదులో తాగడం వల్ల మూత్రంలో మంట కూడా దూరమైపోతుంది.గరిక వేర్లను దంచి రెండు టీ స్పూన్ల రసంలో ఒక కప్పు పెరుగును కలిపి తీసుకోవడం వల్ల మహిళలలో తెల్లబట్ట సమస్య దూరం అయిపోతుంది.

శ్రీ గరిక ముద్ద చేసి మలద్వారం మీద రాస్తే ఆర్శ మొలలు కూడా తగ్గిపోతాయి.కాలిన గాయాలకు గరిక ముద్ద,గుగ్గిలం, కొబ్బరి నూనెతో తయారు చేసిన తైలాన్ని ఉపయోగించడం ఎంతో మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు దంపతులిద్దరూ అరా గిన్నె గరిక కషాయాన్ని త్రాగితే సంతానం కలుగుతుంది.
కాబట్టి గరిక గడ్డి రసాన్ని పై విధంగా ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.