ప్రస్తుత కాలంలో మానవ జీవితం ఉదయం నుండి రాత్రి వరకు ఉరుకు పరుకుల జీవితం.ప్రతి ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు, టీవీ, లాంటి ఎలక్ట్రిక్ వస్తువులు కచ్చితంగా వినియోగిస్తారు.
చాలామంది వ్యక్తులు బయటకు వెళ్లే హడావిడిలో వీటిని ఆపేయడం మరిచిపోయి, వారి పని హడావిడిలో బిజీగా గడుపుతున్నారు.తర్వాత గుర్తుకు వస్తే ఇంటికి వచ్చి వీటిని ఆపేంత సమయం దొరకదు.
ఒకవేళ ఆపేయడం మర్చిపోతే ఇంట్లో కరెంటు సప్లై లో హెచ్చుతగ్గులు ఏర్పడితే స్విచ్ ఆన్ లో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులు దాదాపుగా కాలిపోతాయి.
ధర కాస్త తక్కువ ఉన్న వస్తువులు అయితే పర్వాలేదు కానీ లక్షలు విలువ చేసే వస్తువులు కాలిపోతే నష్టం భారీగానే ఉంటుంది.
సామాన్యుల నుండి ధనవంతుల వరకు అందరూ తమ పనుల హడావిడిలో బిజీగానే ఉంటున్నారు.మనిషి జీవితం హడావిడిగా మారినప్పటి నుండి కరెంటు వినియోగం కూడా విపరీతంగా పెరిగింది.
దీనికి తోడు కరెంటు అధికంగానే వృథా అవుతుంది.పవర్ వోల్టేజ్ లో మార్పులు వస్తే దాదాపుగా ఎలక్ట్రిక్ వస్తువులు కాలిపోతాయి.

ప్రస్తుతం మార్కెట్లో ఈ సమస్యను అధిగమించడానికి స్మార్ట్ డివైజ్ అందుబాటులోకి వచ్చింది.ఈ స్మార్ట్ డివైజ్ ను ఇంట్లో కరెంట్ సరఫరా అయ్యే బోర్డు పక్కన అమర్చాలి.మామూలుగా అయితే ప్రతి ఇంటికి ఇన్పుట్ సప్లై 230 వొల్ట్స్ ఉంటుంది.ఒకవేళ కరెంటు 300 వోల్ట్స్ దాటి సప్లై అయితే ఇంట్లోని ఎలక్ట్రిక్ వస్తువులు అమాంతం కాలిపోతాయి.
ఒకవేళ లోవోల్టేజ్ సప్లై అయినా వస్తువులు కాలిపోయే అవకాశం ఉంది.అదే ఈ స్మార్ట్ డివైజ్ ఇంట్లో ఉన్నట్లయితే పవర్ సప్లై లో హెచ్చుతగ్గులు ఏర్పడినప్పుడు సప్లైను ఆపేస్తుంది.
ఇంకా ఇంట్లోనే ఎలక్ట్రిక్ వస్తువులు కాలిపోయే అవకాశం ఉండదు.పైగా కరెంట్ కూడా ఆదా ఆవుతుంది.