మాల్దీవుల్లోని( Maldives ) ఫులిధూ దీవిలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ఒక మహిళకు ఊహించని రీతిలో షాకింగ్ అనుభవం ఎదురైంది.సముద్రంలో స్విమ్మింగ్ చేస్తుండగా, ఫ్రెండ్లీ అని చెప్పుకునే ఓ సొరచేప( Shark ) ఒకటి ఆమె చేయిని కొరికింది.
దీంతో ఆమె చేయి రక్తమోడుతూ కనిపించింది.ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియోను ట్రావెల్ బ్లాగర్లు చెల్స్, ఆంటోనియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
వీడియోలో చెల్స్( Chels ) మరో ఇద్దరితో కలిసి సముద్రంలో ఈత కొడుతుండగా, రెండు నర్స్ షార్క్‌లు వారి చుట్టూ తిరుగుతున్నాయి.అంతలోనే ఒక్కసారిగా వాటిలో ఒక సొరచేప చెల్స్ చేయిని పట్టుకుని కొరికేసింది.
నిజానికి నర్స్ షార్క్‌లు సాధారణంగా స్నేహపూర్వకంగానే ఉంటాయని బ్లాగర్లు చెబుతున్నారు.వీడియో చూస్తే చెల్స్ కావాలనే తన చేతిని సొరచేప నోట్లో పెట్టినట్లు అనిపించవచ్చు.
కానీ నిజం అది కాదు, సొరచేప పొరపాటున ఆమె చేతిని ఆహారంగా భావించిందని వారు వివరించారు.
“నర్స్ షార్క్‌లు ఆహారం తినేటప్పుడు, బలమైన వాక్యూమ్ లాంటి శక్తితో ఆహారాన్ని లోపలికి పీల్చుకుంటాయి.దురదృష్టవశాత్తు, సొరచేప చెల్స్ చేతిని ట్యూనా చేప ముక్కగా పొరపాటు పడింది.అంతే, ఒక్కసారిగా పీల్చేసింది.
అయితే అది ట్యూనా కాదని తెలుసుకుని వెంటనే వదిలేసింది, హాహా” అంటూ వారు ఆ వీడియో కింద క్యాప్షన్ పెట్టారు.నర్స్ షార్క్( Nurse Sharks ) పీల్చే శక్తి చదరపు అంగుళానికి దాదాపు 43 పౌండ్ల ఒత్తిడిని కలిగిస్తుందంటే అది ఎంత పవర్ ఫుల్లో అర్థం చేసుకోవచ్చు.
అదృష్టవశాత్తూ, గాయం పెద్దది కాకపోవడంతో ప్రమాదం తప్పింది.కానీ చెల్స్ చేయి మాత్రం రక్తమోడటం మొదలైంది.వీడియోలో ఆమెకు వైద్య సహాయం అందిస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.వీడియో చివర్లో, చెల్స్ తన చేతికి బ్యాండేజీ కట్టుకుని, నవ్వుతూ ఫోజులిచ్చింది.ఊహించని సంఘటన జరిగినా ఆమె చిరునవ్వు చెరగలేదు.జంతువులు ఎంత ఫ్రెండ్లీ అని చెప్పినా అవి జంతువులే ఎప్పుడూ ఎలా ప్రవర్తిస్తాయి వాటికి తెలీదు కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిది.