శనగపిండిలో ఇదొక్కటి కలిపి రాస్తే 10 నిమిషాల్లో ముఖం తెల్లగా,కాంతివంతంగా మారుతుంది

శనగపిండి మన చర్మానికి మేలు చేయటమే కాకుండా అనేక చర్మ సమస్యల నుండి రక్షిస్తుంది.శనగపిండి చర్మం మీద నలుపు,మృతకణాలను తొలగించటంలో బాగా సహాయపడుతుంది.

 Homemade Skin Whitening Remedy-TeluguStop.com

అలాగే చర్మం కాంతివంతంగా మరియు మృదువుగా చేస్తుంది.శనగపిండి స్పెషల్ ఏమిటంటే అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది.

ఈ రోజుల్లో అడ మగ ఇద్దరు బయటకు వెళ్లి పనిచేస్తున్నారు.ఆలా బయటకు వెళ్ళినప్పుడు చర్మంపై కాలుష్యం, దుమ్ము వంటి కారణాలతో చర్మం నిర్జీవంగా మారుతుంది.

అలాంటి సమయంలో శనగపిండితో కేవలం పది నిమిషాల్లోనే ముఖాన్ని కాంతివంతంగా మార్చవచ్చు.ఈ చిట్కాను మగవారైనా,ఆడవారైనా ఉపయోగించవచ్చు.

ఈ చిట్కా కి అవసరమైన పదార్ధాల గురించి తెలుసుకుందాం.శనగపిండి, గోధుమపిండి,పసుపు,పెరుగు.

ఇవి మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి.గోధుమపిండి చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి మృదువుగా,కాంతివంతంగా చేయటానికి సహాయపడుతుంది.

పసుపులో ఉండే పోషకాలు,యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మంపై బ్యాక్టీరియాను తొలగించి మొటిమలు,నల్లని మచ్చల సమస్యలను నివారిస్తుంది.అలాగే ముఖానికి మంచి కాంతిని ఇస్తుంది.

పెరుగులోని లాక్టిక్ ఆమ్లం మరియు పోషకాలు చర్మానికి పోషణను అందించి నలుపు,తాన్ తొలగించి చర్మాన్ని మృదువుగా, తెల్లగా మార్చుతుంది.ఇప్పుడు ప్యాక్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి,అర స్పూన్ గోధుమపిండి,చిటికెడు పసుపు, పెరుగు వేసి పేస్ట్ గా తయారుచేసుకోవాలి.ఈ పేస్ట్ ని ముఖానికి రాసి కొంచెం సేపు చేతి వేళ్ళ సాయంతో మసాజ్ చేసి 30 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ ప్యాక్ ముఖ ఛాయను పెంచటమే కాకుండా ముఖ రంద్రాలను కూడా తగ్గిస్తుంది.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంలో మలినాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ప్యాక్ ని ట్రై చేసి ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా మార్చుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube