టీమిండియా స్టార్ వికెట్ కీపర్, డాషింగ్ క్రికెటర్ రిషభ్ పంత్( Rishabh Pant ) తన మంచి మనసును చాటుకుంటూ స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నాడు.ఇకపై తన యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం పేదల సహాయం కోసం విరాళంగా( Donation ) అందించనున్నట్లు ప్రకటించాడు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన రిషభ్ పంత్ తన నిర్ణయంపై ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశాడు.ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.రిషభ్ పంత్ వీడియోలో మాట్లాడుతూ.“క్రికెట్ నాకు చాలా నేర్పింది.ఇది నాకు ఎంతో అందించింది.కొన్ని అనుకోని సంఘటనలు జీవితానికి గొప్ప పాఠాలు నేర్పిస్తాయి.
కొన్నేళ్ల క్రితం నేను చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను.ఆ కష్టాలు నాకు జీవితంపై కొత్త దృక్పథాన్ని ఇచ్చాయి.ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నట్టు, పేద ప్రజల( Poor People ) ముఖాలపై కూడా చిరునవ్వు తీసుకురావాలనే నా లక్ష్యం.అందుకే నా యాడ్ ఆదాయంలో 10 శాతం పేదలకు అందించాలనుకున్నాను.
ఈ లక్ష్యంతోనే ‘RPF ఫౌండేషన్’( RPF Foundation ) ను ప్రారంభించాను.రాబోయే రెండు నెలల్లో దీని గురించి మరింత సమాచారం తెలియజేస్తాను” అని పంత్ చెప్పాడు.
పంత్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరహా పనులు ఇతర స్టార్ ఆటగాళ్లకు స్ఫూర్తినివ్వాలని అభిప్రాయపడుతున్నారు.సమాజ సేవలో భాగస్వామ్యమవుతున్న పంత్‌ను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు.ఇకపోతే, ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రిషభ్ పంత్ అత్యధిక ధరకు అమ్ముడైన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ అతడిని రూ.27 కోట్లకు కొనుగోలు చేసి తమ జట్టుకు కెప్టెన్‌గా నియమించింది.రిషభ్ పంత్ మంచి మనసుతో తీసుకున్న ఈ నిర్ణయం పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.RPF ఫౌండేషన్ ద్వారా పేదలకు అందించబోయే సేవలు క్రికెట్ మైదానం వెలుపల కూడా పంత్‌ను నిజమైన హీరోగా నిలబెడతాయని స్పష్టం చేస్తున్నారు.