అమెరికా( America ) నుంచి మొత్తం 104 ఇండియన్స్ బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే.వారి ఒకరైన జస్పాల్ సింగ్( Jaspal Singh ) తాజాగా సంచలన విషయాలు వెల్లడించాడు.
తమని అమెరికా సైనిక విమానంలో చేతులు, కాళ్లు బంధించి తీసుకొచ్చారని, విమానం అమృత్‌సర్ విమానాశ్రయంలో( Amritsar Airport ) దిగిన తర్వాతనే ఆ బంధనాలు విప్పారని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.గుర్దాస్‌పూర్ జిల్లాలోని హర్డోర్వాల్ గ్రామానికి చెందిన 36 ఏళ్ల జస్పాల్ సింగ్‌ను అమెరికా సరిహద్దు దాటుతుండగా జనవరి 24న అక్కడి బోర్డర్ పెట్రోల్ పోలీసులు అరెస్టు చేశారు.
బుధవారం ఒక అమెరికా సైనిక విమానం( US Military Flight ) ద్వారా 104 మంది అక్రమ వలసదారులను భారతదేశానికి తిప్పి పంపారు.డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) సర్కార్ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపిన తర్వాత మొదటిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో భారతీయులను( Indians ) వెనక్కి పంపడం జరిగింది.
ఈ వెనక్కి పంపబడిన వారిలో హర్యానా నుంచి 33 మంది, గుజరాత్ నుంచి 33 మంది, పంజాబ్ నుండి 30 మంది, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి ముగ్గురు చొప్పున, చండీగఢ్ నుంచి ఇద్దరు ఉన్నారని సమాచారం.వీరిలో 19 మంది మహిళలు, 13 మంది పిల్లలు ఉన్నారు.
పంజాబ్ నుంచి వచ్చిన వారిని అమృత్‌సర్ విమానాశ్రయం నుంచి పోలీసు వాహనాల్లో వారి ఇళ్లకు తరలించారు.

జస్పాల్ సింగ్ మాట్లాడుతూ.ట్రావెల్ ఏజెంట్ తనను మోసం చేశాడని వాపోయాడు.అమెరికాకు చట్టబద్ధంగా వెళ్లడానికి ఏకంగా రూ.30 లక్షలు చెల్లించానని తెలిపాడు.ఏజెంట్ సరైన వీసా ఏర్పాటు చేస్తానని నమ్మబలికాడని, కానీ చివరకు అక్రమ మార్గంలో పంపాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
జస్పాల్ మొదట 2024 జులైలో బ్రెజిల్‌కు విమానంలో వెళ్లాడు.అక్కడ్నుంచి అమెరికాకు ఫ్లైట్‌లో పంపిస్తానని ఏజెంట్ హామీ ఇచ్చాడు.కానీ బ్రెజిల్‌లో ఆరు నెలలు ఉన్న తర్వాత అక్రమంగా అమెరికా సరిహద్దు( US Border ) దాటవలసి వచ్చిందని చెప్పాడు.

అమెరికా అధికారులు అతన్ని సరిహద్దు వద్ద అరెస్టు చేసి 11 రోజులు నిర్బంధంలో ఉంచారు.ఆ తర్వాత ఇండియాకు తిప్పి పంపారు.తమను ఇండియాకు పంపిస్తున్నారని తనకు తెలియదని జస్పాల్ చెప్పాడు.
తమను మరో నిర్బంధ శిబిరానికి తరలిస్తున్నారని అనుకున్నామని తెలిపాడు.కానీ ఆ తర్వాత ఒక పోలీసు అధికారి తమను భారతదేశానికి పంపుతున్నట్లు చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశాడు.“మా చేతులకు సంకెళ్లు వేశారు, కాళ్లకు గొలుసులు వేశారు.అమృత్‌సర్‌లో దిగిన తర్వాతనే వాటిని తీసేశారు” అని అతను కన్నీటి పర్యంతమయ్యాడు.
“మేం చాలా డబ్బు ఖర్చు చేశాం, చాలా వరకు అప్పులు తెచ్చాం.ఇప్పుడు అంతా పోయింది” అని జస్పాల్ గుండెలు పగిలేలా విలపించాడు.
అతని కజిన్ జస్‌బీర్ సింగ్ మాట్లాడుతూ.తమ కుటుంబం మీడియా ద్వారా బహిష్కరణ గురించి తెలుసుకుందని చెప్పాడు.“మేం మా కుటుంబాలకు మంచి భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్తాం.” అని జస్‌బీర్ అన్నాడు.“ఇప్పుడు ఆ కలలన్నీ చెదిరిపోయాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా, C-17 గ్లోబ్‌మాస్టర్ అనే అమెరికా సైనిక విమానం బుధవారం అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది.
ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరపడానికి కొన్ని రోజుల ముందు ఈ బహిష్కరణ జరగడం గమనార్హం.