టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ప్రభాస్( Prabhas ) ఒకరు.కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపారు.
అయితే బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇటీవల ప్రభాస్ కల్కి, సలార్ వంటి వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు.
ఇక త్వరలోనే ఈ సినిమాల సీక్వెల్ షూటింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయని విషయం మనకు తెలిసిందే .అయితే తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో రాబోతున్న సలార్ 2( Salaar 2 ) సినిమా గురించి ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్( Pruthvi raj Sukumaran ) ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడి పాత్రలో పృథ్వీరాజ్ కనిపించిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి అయ్యాయని అతి త్వరలోనే సలార్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలిపారు.
ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే సలార్ 2 ప్రారంభం కాబోతుందని తెలిపారు.

ఇక ఈ సలార్ సినిమా ద్వారా ప్రభాస్ తనకు చాలా మంచి స్నేహితుడు అయ్యారు అంటూ గతంలో ఎన్నోసార్లు తెలిపిన పృథ్వీరాజ్ తాజాగా మరోసారి ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. హీరోగా ప్రభాస్ కి ఉన్న స్టార్ డమ్ ఆయనకు తెలియదు.నాకు తెలిసినంతవరకు ప్రభాస్ కనీసం సోషల్ మీడియా కూడా ఉపయోగించరు.అతనొక ప్రవైట్ పర్సన్ కేవలం అత్యంత సన్నిహితుల వద్ద మాత్రమే అన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు అంటూ ప్రభాస్ గురించి పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక మీరు ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో నటించబోతున్నారంట కదా అనే ప్రశ్న కూడా ఎదురు కావడంతో ఇప్పటివరకు ఈ విషయం నాకైతే తెలియదు నాకంటే బాగా మీకే అన్ని తెలిసాయి అంటూ మాట్లాడారు.ఇంకా ఏదీ స్పష్టత రాలేదు.చర్చలు జరుగుతున్నాయి.అవి ఫైనల్ అయ్యాక దీని గురించి మాట్లాడుకుందాం అంటూ పృథ్వీ రాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.