చందు మొండేటి( Chandu modeti ) దర్శకత్వంలో సాయి పల్లవి,నాగచైతన్య( Sai Pallavi, Naga Chaitanya ) కలిసి నటిస్తున్న చిత్రం తండేల్.ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల అనగా ఫిబ్రవరి 7వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.
ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే సాయి పల్లవి నాగ చైతన్య కాంబినేషన్ లో గతంలో విడుదలైన లవ్ స్టోరీ సినిమా మంచి సక్సెస్ అవడంతో ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.ఈ సినిమా నుంచి విడుదలైన ఒక్కొక్క అప్డేట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.ఆ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ చందు మొండేటి సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఎంతో మంది సముద్రం మధ్యలో షూటింగ్ అంటే భయపడ్డారు.కానీ సాయి పల్లవి మాత్రం స్విమ్మింగ్ రాకపోయినా ఎక్కడా భయపడ లేదు.కెమెరా ముందు బాగా నటించేది.
ఇక సాయి పల్లవి సెట్ కి వస్తే కూడా ఎంతో సింపుల్ గా ఉంటారు.పక్కన అసిస్టెంట్లు కూడా ఎవ్వరూ ఉండరు.
అలా సింపుల్ గా వచ్చి సన్ స్క్రీమ్ ఒకటి రాసుకుంటుంది.

సినిమా టీం గుంపులోనే ఒక వ్యక్తిగా అలా ఉండిపోతుంది.ఈమె హీరోయినా? అని అంతా షాక్ అయ్యేలా కలిసిపోతోందట.తానొక స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు ఇవ్వాలని, ప్రత్యేకమైన గుర్తింపు కోసం కూడా సాయి పల్లవి పాకులాడని, స్వామి వివేకానంద, రమణ మహర్షి( Swami Vivekananda, Ramana Maharishi ) టైపులో ఎంతో సింపుల్‌గా ఉంటుందని చందూ మొండేటి చెప్పుకొచ్చారు.
ఇక ఈ తండేల్ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య పోటీ వస్తుందని, సినిమా చూసిన ప్రతీ ఒక్కరు ఎవరు గొప్పగా నటించారు? అనే చర్చ మాత్రం పెట్టుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు.