వీడియో వైరల్: గ్రౌండ్ లోకి వెళ్లి కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమాని

ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024-25లో ( Ranji Trophy 2024-25 )భాగంగా ఢిల్లీ, సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటనకు వేదికైంది.అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా ఓ అభిమాని సెక్యూరిటీని దాటుకొని మైదానంలోకి దూసుకొచ్చాడు.

 A Fan Planted Kohli's Legs After The Video Went Viral, Ranji Trophy 2024-25, Vir-TeluguStop.com

ఆ అభిమాని నేరుగా తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లి అతని కాళ్లు మొక్కాడు.ఈ అనూహ్య సంఘటనతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ అభిమానిని మైదానం బయటకు లాక్కెళ్లారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బీసీసీఐ ఆల్టిమేటం( BCCI Ultimatum ) ప్రకారం అందుబాటులో ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధన విధించడంతో.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాల్సి వచ్చింది.ఇకపోతే, కోహ్లీ ( Kohli )12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీ ఆడటం క్రికెట్ అభిమానులకు పెద్ద ఆనందాన్ని ఇచ్చింది.

స్టేడియంలో కోహ్లీ మేనియా బాగా కనిపించింది.తన అభిమాన ఆటగాడిని ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు వేలాదిగా స్టేడియానికి తరలివచ్చారు.అది ఎంతలాఅంటే తెల్లవారుజామున 3 గంటలకే ప్రజలు స్టేడియం బయట పెద్దెత్తున క్యూ కట్టారు.

దాంతో అరుణ్ జైట్లీ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది.ఇక ఉదయం పూట అయితే.“కోహ్లీ.ఆర్‌సీబీ.విరాట్.” నినాదాలతో స్టేడియం బిగ్గరగా దద్దరిల్లిపోయింది.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ మ్యాచ్ కోహ్లీ బ్యాటింగ్‌తో కాకుండా, అభిమానుల మద్దతుతో మరింత స్పెషల్‌గా నిలిచిపోయింది.ఇక నేడు ఢిల్లీ బౌలింగ్ చేస్తుండడంతో కోహ్లీ రేపు అంటే శుక్రవారం బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది.చుడాలిమరి కోల్ పూర్వ వైభవాన్ని అందుకుంటాడో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube