టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వాళ్ల వాళ్ల సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సాధించారు వారిలో అప్పట్లో జయసుధ ,జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్స్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు,మురళీమోహన్ లాంటి వారితో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.అయితే వీళ్ళ తర్వాత వచ్చిన హీరోయిన్స్ లో విజయశాంతి,రాధా, రంభ లాంటి హీరోయిన్స్ ఉన్నారు వీరిలో ముఖ్యంగా విజయశాంతి గారి గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ఆవిడ చాలా సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపును సాధించారు.
తూర్పు గోదావరి లోని అనపర్తి లో జన్మించారు విజయశాంతి చిన్నమ్మ విజయ లలిత గారు ఇండస్ట్రీలో వ్యాంపు క్యారెక్టర్లు చేస్తూ ఉండేవారు.అలా చేస్తున్న క్రమంలో విజయశాంతి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చెన్నై రమ్మని ఆవిడ తీసుకెళ్లారు అక్కడ విజయశాంతి కూడా సినిమాల్లో ట్రై చేస్తూ చిన్న చిన్న వేషాలు వేస్తూ హీరోయిన్ గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే అప్పట్లో రాఘవేంద్ర రావు గారు తీసిన సినిమాల్లో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించింది అలాగే కృష్ణ శోభన్ బాబు లాంటి హీరోలతో కూడా నటించింది.
చిరంజీవి తో చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా లో చిరంజీవి కి దీటైన క్యారెక్టర్ చేసి చిరంజీవి తో పోటీపడి నటించింది అలాగే బాలకృష్ణ తో చేసిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా లో బాలకృష్ణ తో సమానంగా ఆటోరాణి పేరుతో మంచి క్యారెక్టర్ చేసి వీలైనప్పుడు రౌడీల తాట తీసే క్యారెక్టర్లు కూడా చేసింది.
నాగార్జున తో జానకి రాముడు లాంటి ఒక మంచి డీసెంట్ సినిమాలో నటించి నటన పరంగా తన స్థాయిని పెంచుకున్న నటి విజయశాంతి విజయశాంతి ఎంత చేసిన హీరోయిన్ గా గుర్తింపు తప్ప మంచి యాక్టర్ అని గుర్తింపు రావట్లేదు దీంతో టీ.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ప్రతిధ్వని లాంటి సినిమాలతో మంచి యాక్టర్ గా గుర్తింపు పొందింది ఏడు సినిమాలు టి.కృష్ణ డైరెక్షన్లో చేసి మంచి నటి అని గుర్తింపును సాధించింది.దీంతో టి.కృష్ణ అంటే విజయశాంతి కి ఒక తండ్రిలాగా మారిపోయారు అయితే అనుకోకుండా టి.కృష్ణ గారు మరణించడం జరిగింది అయితే ఆయన మరణవార్త విన్న విజయశాంతి ఒక నాలుగైదు రోజులు దాకా ఆవిడ చాలా బాధపడ్డారని ఒక టైంలో ఆవిడ మానసికంగా కూడా కొంత డిప్రెషన్ కి వెళ్ళిపోయారు అని చెప్పొచ్చు.అయితే టీ కృష్ణ గారు లాంటి మంచి మనిషి వెళ్లిపోయిన తర్వాత ఇండస్ట్రీలో తనకు అంత పెద్ద దిక్కు ఇంకెవరు ఉన్నారు అని చాలా బాధ పడ్డారనీ విజయశాంతి గురించి తెలిసిన చాలా మంది అంటుంటారు.
దర్శకుడు టి కృష్ణ అంటే ఇప్పుడున్న హీరో గోపీచంద్ వాళ్ల నాన్న.విజయశాంతి ఆ తర్వాత దాసరి నారాయణ రావు గారి డైరెక్షన్ లో చేసిన ఒసేయ్ రాములమ్మ సినిమాకి మంచి పేరుతో పాటు అవార్డులు కూడా వచ్చాయి.సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో విజయశాంతి రాజకీయాల వైపు వెళ్లి అక్కడ రాణించారు.అయితే ఈ మధ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా లో ఒక మంచి క్యారెక్టర్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి క్యారెక్టర్ చేశారని అందరి చేత గుర్తింపు పొందారు.
విజయశాంతి ఇప్పుడు బిజెపి పార్టీలో ఉండి రాజకీయాల్లో కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి తనదైన మార్కు చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.రాజకీయం తో పాటు మళ్ళీ సినిమాలు చేస్తారా లేదా అనేది చూడాలి.