సినీనటి అభినయ(Abhinaya) పరిచయం అవసరం లేని పేరు.తమిళ చిత్ర పరిశ్రమ నుంచి నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.
నేనింతే, శంభో శివ శంభో, దమ్ము, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలలో అభినయ అద్భుతమైన నటనను కనబరుస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా ఈమె ఇటీవల ఓ మలయాళీ సినిమాలో హీరోయిన్గా కూడా నటించారు.

ఇక ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన అభినయ ప్రేమ గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.ఈమె హీరో విశాల్ (Vishal)తో ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అభినయ స్పందిస్తూ తాను ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని గత 15 సంవత్సరాలుగా తన స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని తెలిపారు.త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని క్లారిటీ ఇచ్చారు.గత కొద్ది రోజుల క్రితం ఈమె నిశ్చితార్థం చేసుకున్న విషయాన్ని వెల్లడించారు, కానీ తనకు కాబోయే భర్తను మాత్రం ఎవరికీ పరిచయం చేయలేదు.

ఇకపోతే తాజాగా అభినయ తనకు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు కార్తీక్ (Karthik).ఈ అబ్బాయి హైదరాబాద్ కి చెందిన ఒక బిజినెస్మెన్ అని తెలుస్తుంది.ఇటీవల కార్తీక్ పుట్టినరోజు కావడంతో అభినయ తన పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడమే కాకుండా తనతో చాలా చనువుగా ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసిన అభిమానులు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.