భూమి మీద అడుగుపెట్టబోతున్న సునీతా విలియమ్స్..టైమ్ ఫిక్స్ చేసిన నాసా

సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి.ఆమె అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో (NASA) కీలక బాధ్యతలు నిర్వహించారు.

 Sunita Williams Is About To Land On Earth.. Nasa Has Fixed The Time., Sunita Wil-TeluguStop.com

ఆమె ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అంతరిక్షంలో గడిపిన మహిళల జాబితాలో స్థానం సంపాదించారు.అంతరిక్షంలో ఎక్కువ కాలం నడక చేసిన తొలి మహిళల్లో ఒకరుగా ఆమె రికార్డు సృష్టించారు.

అంతరిక్ష ప్రయాణాల్లో ఆమెకు అపారమైన అనుభవం ఉంది.సుమారు 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమ్మీదకు తిరిగి రానున్నారు.

స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా భూమ్మీదకు రాబోతున్నారు.అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం, భారత కాలమానం ప్రకారం మార్చి 19న తెల్లవారుజామున వారు భూమిపై ల్యాండ్ కానున్నారు.

NASA తాజా ప్రకటన ప్రకారం, ఈ వ్యోమగాములు మార్చి 18న (భారత కాలమానం ప్రకారం మార్చి 19) ఉదయం 3:27 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు.అంతరిక్ష నౌక ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో సాయంత్రం 5:57 గంటలకు దిగనుంది.దీనిని NASA ఈ మిషన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.మార్చి 17న (భారత కాలమానం ప్రకారం మార్చి 18 ఉదయం 8:30 IST) అంతరిక్ష నౌక హాచ్ క్లోజర్ (Ship hatch closure)సన్నాహాలతో స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్(SpaceX Crew-9 mission) తిరిగి రావడానికి సిద్దమవుతోంది.

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ (Sunita Williams, Butch Wilmore)తొలుత జూన్ 2023లో బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ద్వారా ISS (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) కు చేరుకున్నారు.అయితే, ప్రొపల్షన్ సిస్టమ్‌లో ఏర్పడిన సమస్యల కారణంగా నాసా ఈ వాహనాన్ని తిరిగి భూమికి పంపడం సురక్షితం కాదని నిర్ణయించింది.దీని వల్ల వీరు అప్రయత్నంగా ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండాల్సి వచ్చింది.సాధారణంగా అంతరిక్ష వ్యోమగాములు 6 నెలల పాటు మాత్రమే మిషన్లలో ఉంటారు.కానీ, ఈ జంట దాదాపు 9 నెలల పాటు ISSలో ఉండాల్సి వచ్చింది.

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌తో పాటు NASA వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మోస్ (రష్యా అంతరిక్ష సంస్థ) వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఈ ప్రయాణంలో పాల్గొంటున్నారు.వీరు అంతరిక్షంలో అనేక ప్రయోగాలు, పరిశోధనలు నిర్వహించి భూమికి తిరిగి రాబోతున్నారు.వారం చివరిలో వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశం ఉండటంతో, NASA ఈ మిషన్ షెడ్యూల్‌ను ముందుకు జరిపింది.

భూమికి సురక్షితంగా తిరిగి చేరుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు NASA స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube