యంగ్ హీరో నితిన్(Nithin) ప్రస్తుతం వరుస ఫ్లాప్ సినిమాలతో ఎంతో సతమతమవుతున్నారు.ఈ క్రమంలోనే ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగానే ఈయన త్వరలోనే రాబిన్ హుడ్ (Robin Hood)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీ లీల (Sreeleela)హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
ఈ క్రమంలోనే నితిన్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఈ సినిమా హిట్ అవ్వటం నితిన్ కెరీర్ కు చాలా అవసరం అని చెప్పాలి.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ కు యాంకర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు స్టార్ హీరోల ఫోటోలను చూపించి మీరు వీరి నుంచి ఏదైనా దొంగలించాలి అంటే ఏమి దొంగలిస్తారు అంటూ ప్రశ్న వేశారు.ఈ ప్రశ్నకు నితిన్ కూడా ఆసక్తికరమైన సమాధానాలను తెలియజేశారు.

నితిన్ ఒక్కొక్క హీరో గురించి ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు.ప్రభాస్ నుంచి వ్యక్తిత్వం, విజయ్ దేవరకొండ నుంచి రౌడీ క్యారెక్టర్, బన్నీ నుంచి డ్యాన్స్, మహేశ్ బాబు నుంచి అందం, పవన్ కల్యాణ్ నుంచి అన్నీ దొంగిలిస్తానని చెప్పుకొచ్చాడు.జూనియర్ ఎన్టీఆర్ నుంచి డైలాగ్ డెలివరీ, నాని నుంచి ఈగ మూవీ దొంగిలించాలని ఉందంటూ చెప్పారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో హీరోయిన్స్ కాజల్ ఫోటోలను చూపించగా వీరిద్దరి నుంచి ఏదైనా దొంగలించాల్సి వస్తే వారి కళ్ళు దొంగలిస్తాను అని తెలిపారు.అలాగే అనుష్క ఫోటో చూపించగా అనుష్క హైట్ దొంగతనం చేస్తాను అంటూ ఈయన సరదాగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.