తగ్గేదెలా.. వెస్టిండీస్ బౌలర్ పై కాలు దువ్విన యువరాజ్ సింగ్

క్రికెట్ అంటేనే జెంటిల్ మ్యాన్ గేమ్.ఆటలో కొట్లాటలు, కోపాలు, సరదా సన్నివేషాలు మాములే.

 Yuvraj Singh Steps On West Indies Bowler, Yuvraj Singh, Tino Best, Iml 2025, Ind-TeluguStop.com

ఇకపోతే, తాజాగా ముగిసిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML 2025) టీ20(T20) టోర్నీ విజేతగా భారత్ జట్టు నిలిచింది.ఈ టోర్నీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది.

సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)సారథ్యంలోని ఇండియా మాస్టర్స్ జట్టు, వెస్టిండీస్ మాస్టర్స్ జట్టుతో తలపడింది.ఈ పోరులో భారత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ విజయంతో టోర్నీ ఛాంపియన్ గా నిలిచింది.అయితే, ఈ మ్యాచ్‌లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

యువరాజ్ సింగ్, వెస్టిండీస్ బౌలర్ టినో బెస్ట్ (Yuvraj Singh, West Indies bowler Tino Best)మధ్య స్వల్ప వివాదం ఏర్పడి, అది చిన్న గొడవగా మారింది.

భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో క్రీజులో.

యువరాజ్ సింగ్, అంబటి రాయుడు ఉన్నారు.ఇదే సమయంలో టినో బెస్ట్ తన ఓవర్ పూర్తిచేసి గాయంతో మైదానాన్ని వీడేందుకు ప్రయత్నించాడు.

అయితే, యువరాజ్ సింగ్ ఈ విషయాన్ని అంపైర్ బిల్లీ బౌడెన్ కు తెలియజేశాడు.అంపైర్ టినో బెస్ట్ తిరిగి మైదానంలో ఉండాలని సూచించడంతో, టినో చిరాకు పడ్డాడు.

దీంతో యువరాజ్ సింగ్ పైకి దూసుకొచ్చాడు.

యువరాజ్ కూడా వెనక్కు తగ్గకుండా ఎదురుతిరిగాడు.

ఒక్కసారిగా మాటల యుద్ధం మొదలైంది.వారి మధ్య వాగ్వాదం తీవ్రమవుతుండడంతో, వెస్టిండీస్ మాస్టర్స్ కెప్టెన్ బ్రియాన్ లారా జోక్యం చేసుకొని వారిని సముదాయించాడు.

అంబటి రాయుడు కూడా టినో బెస్ట్‌ను ప్రశాంతంగా ఉండాలని కోరాడు.దీంతో వివాదం అదుపులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సంఘటన జరిగిన కొద్ది క్షణాల తర్వాత, యువరాజ్ సింగ్ తన విధ్వంసక ఆటను కొనసాగించాడు.

టినో బెస్ట్ వేసిన బంతిని భారీ సిక్స్ కొట్టి, తన దూకుడు చూపించాడు.అంతేకాదు, సిక్స్ కొట్టిన వెంటనే తన బ్యాట్‌ను టినో బెస్ట్ వైపు చూపించి ఛాలెంజ్ చేసినట్లు కనిపించాడు.

అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత యువరాజ్, టినో బెస్ట్ మధ్య ఉన్న ఘర్షణ కాస్తా సరదా వాతావరణంగా మారింది.ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడం, యువరాజ్ టినో వీపుపై తట్టడం కూడా వీడియోలో కనిపించింది.ఈ సంఘటన అభిమానులను తెగ ఆకర్షించింది.భారత జట్టు IML 2025 విజేతగా నిలవడం అభిమానులకు గొప్ప గర్వకారణంగా మారింది.ఈ టోర్నీలోని సీనియర్ క్రికెటర్లు అద్భుత ఆటతీరు కనబరచారు.ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది, ముఖ్యంగా యువరాజ్ సింగ్, టినో బెస్ట్ మధ్య జరిగిన సంఘటన అభిమానులకు మరింత థ్రిల్ ఇచ్చింది.

ఈ ఘర్షణ అంతర్జాతీయ క్రికెట్‌కి తిరిగి వచ్చిన అనుభూతిని అందించింది.మ్యాచ్ అనంతరం విద్వేషాన్ని కంటే, స్నేహాన్ని ప్రదర్శించిన యువరాజ్, టినో బెస్ట్‌ను అభిమానులు మరింతగా మెచ్చుకున్నారు.

ఈ సంఘటన క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య కోపం తాత్కాలికమే, కానీ ఆటకు గౌరవం శాశ్వతమని మరోసారి రుజువైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube