చలి కాలం ప్రారంభం అవుతోంది.ఈ సీజన్‌లో చర్మమే కాదు పెదవులు కూడా పొడి బారి పోయి నిర్జీవంగా కనిపిస్తుంటాయి.
ఎంత ఖరీదైన లిప్ మాయిశ్చరైజర్, లిప్ బామ్ వాడినా మళ్లీ కొద్ది సేపటికే పెదవులు ఎండి పోయి నట్టు అయిపోతుంటాయి.అయితే చలి కాలంలో పెదాలను తేమగా, మృదువుగా ఉంచడంలో కొన్ని కొన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ అద్భుతంగా సహాయపడతాయి.
మరి ఆ రెమెడీస్ ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
చలి కాలంలో డ్రై లిప్స్‌కు చెక్ పెట్టడంలో బ్లాక్ టీ ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.
అందు కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ల బ్లాక్ టీ, ఒక స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేసి పది లేదా ఇరవై నిమిషాల అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే పెదాలు పొడి బారకుండా తేమగా ఉంటాయి.

అలాగే పీనట్ బటర్ కూడా చలి కాలంలో పెదవులను తేమగా, మృదువుగా ఉంచగలదు.అందుకు బౌల్‌లో ఒక స్పూన్ పీనట్ బటర్, ఒక స్పూన్ పెరుగు వేసుకుని కలుపుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్ర పోవడానికి ముందు లిప్స్ అప్లై చేసుకోవాలి.
ఉదయం లేవగానే కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజూ చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఈ టిప్స్‌తో పాటుగా శరీరానికి అవసరమయ్యే నీటితోపాటు శీతాకాలంలో ఇంకా ఎక్కువ నీళ్లను తీసుకోండి.కెమికల్స్ లేని న్యాచురల్ లిప్ బామ్‌నే వాడండి.
ఎప్పటికప్పుడు పెదాలపై ఏర్పడిన డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలిగించండి.మరియు పడుకునే ముందు లిప్‌స్టిక్‌ను తప్పనిసరిగా తీసేసి.
వెన్నతో కాసేపు మసాజ్ చేసుకోండి.తద్వారా పెదాలు పగలడం, పొడి బారడం, నిర్జీవంగా మారవడం వంటి సమస్యలేమి ఉండవు.