న్యూస్ రౌండప్ టాప్ 20 

1.దళిత బంధు ను అడ్డుకుంది బీజేపీనే : మోత్కుపల్లి

  హుజురాబాద్ లో దళిత బంధు అమలును బీజేపీనే అడ్డుకుందని టిఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.

 

2.కెసిఆర్ తో చర్చలకు సిద్ధం : బీజేపీ ఎమ్మెల్యే

  దళిత బందు అమలుపై సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని దీనిపై ఆయనతో చర్చించేందుకు తాను సిద్ధమని దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ చేశారు. 

3.యాదాద్రి పర్యటనలో కేసీఆర్

  తెలంగాణ సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి యాదాద్రి పర్యటనకు బయలుదేరి వెళ్లారు.అక్కడ ఆయన ఆలయ పునః నిర్మాణ పనుల్లో  

4.రేవంత్ కు కేటీఆర్ సవాల్

టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. 

5.నేటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్లు

ఇంటర్ ప్రథమ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు థియరీ పరీక్షలు ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు జరగనున్నాయి అని ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.దీనికి సంబంధించిన హాల్ టికెట్లు ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. 

6.బోయినపల్లి కిడ్నాప్ కేసు దర్యాప్తు పూర్తి

  హైదరాబాద్ నగరంలోని బోయిన్ పల్లి లో సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు. 

7.పీజీ ఈసెట్ ప్రవేశాలకు 25 వరకు గడువు

  తెలంగాణలో ఇంజినీరింగ్ , టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పేజీఈ సెట్ 2021 ద్వారా కాలేజీలో చేరేందుకు అభ్యర్థులు సర్టిఫికెట్లను అప్లోడ్ చేసుకునేందుకు గడువును ఈనెల 25 వరకు పొడిగించారు. 

8.ప్రధాని మోదీ కి చంద్రబాబు లేఖ

Advertisement

  ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.బిసి జనగణన చేపట్టాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. 

9.ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల

  వైయస్సార్సీపి అధినేత్రి షర్మిల మంగళవారం ఇడుపులపాయకు చేరుకున్నారు. 

10.ఎయిడెడ్ టీచర్ల విలీనానికి షెడ్యూల్

   ఎయిడెడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లోని ఖాళీల్లో నియమించి విలీన ప్రక్రియను ముగించేందుకు ఏపీ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. 

11.ఎన్నికల సంఘానికి రాసిన లేఖ విడుదల చేసిన బీజేపీ

  దళిత బంధు పథకం బిజెపి కారణంగానే నిలిచిపోయిందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది అని బిజెపి నేత ప్రేమేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు ఈ నెల 7 న కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను విడుదల చేశారు. 

12.ఈటెల రాజేందర్  దిష్టిబొమ్మ దహనం

  దళిత బంధు పథకం నిలిచిపోవడానికి బిజెపి కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖ కారణం అని ఆరోపిస్తూ దళిత సంఘాల నేతలు అనేక చోట్ల ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ లను దహనం చేశారు. 

13.ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు

  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తానని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. 

14.జమ్మూ కాశ్మీర్ పర్యటనలో అమిత్ షా

  ఈ నెల 23 24 తేదీల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. 

15.షారూక్ కుమారుడికి కౌన్సిలింగ్

  మాదకద్రవ్యాల కేసులో ముంబై లోని ఆర్థర్ రోడ్డు జైలులో బెయిల్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్ సీబీ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. 

16.ఎంపీ పదవికి రాజీనామా

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

  బీజేపీ నేత బాబుల్ సుప్రీయో మంగళవారం లాంఛనంగా తన ఎంపీ పదవికి రాజీనామ చేశారు. 

17.వీరప్పన్ వర్ధంతి

Advertisement

  గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ 17 వ వర్ధంతి ని తమిళనాడు జిల్లా మెట్టూరు సమీపంలోని మూలక్కాడు కావేరీ నదీ తీరంలో వీరప్పన్ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. 

18.కాంగ్రెస్ పై కేటీఆర్ కామెంట్స్

  హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ను గెలిపించేందుకు కాంగ్రెస్ అక్కడ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది అని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

19.విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం

  విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉద్యమం నేటికీ 250 వ రోజుకి చేరుకుంది. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్వారెట్ల పది గ్రాముల బంగారం ధర -46,510   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,510 .

తాజా వార్తలు