అనిల్ రావిపూడిని కొట్టిన వాళ్లకు భారీ ఆఫర్ ఇచ్చిన జక్కన్న.. షాక్ లో డైరెక్టర్!

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) తాజాగా కృష్ణమ్మ (Krishnamma) సినిమా ప్రీ రిలీజ్ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి రాజమౌళి మాత్రమే కాకుండా కొరటాల శివ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి (Koratala Siva, Gopichand Malineni, Anil Ravipudi)వంటి డైరెక్టర్లు హాజరై సందడి చేశారు.

 Rajamouli Funny Comments On Anil Ravipudi At Krishnamm Event, Anil Ravipudi, Raj-TeluguStop.com

సత్యదేవ్ హీరోగా నటించినటువంటి ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) రాజమౌళిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈయన రాజమౌళిని ప్రశ్నిస్తూ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోయే సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలని కోరారు.మీ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా ఎలాంటి జానర్ లో రాబోతుందో చెప్పాలని కోరారు.

ఇక ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెబుతూ.

అనిల్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెప్పకపోవడమే కాకుండా ఎవరైతే కెమెరా వెనుక ముసుగు వేసుకొని అనిల్ రావిపూడిని కొడతారో వాళ్లకు పదివేల రూపాయలు బహుమానంగా ఇస్తానని సరదాగా ఆటపట్టించారు.ఇలా రాజమౌళి మాటలకు షాక్ అయినటువంటి అనిల్ రావిపూడి సర్.ప్రైజ్ మనీ కాస్త తగ్గించండి ఒకేసారి 10000 అంటే నిజంగానే వచ్చి కొట్టేస్తారు అంటూ నవ్వులు పూయించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక రాజమౌళి మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా గురించి అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube